అతను చేసిన పనికి 6 నెలలు నరకం అనుభవించా.. నా ముఖాన్ని అద్దంలో చూసుకోలేదు

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
అతను చేసిన పనికి 6 నెలలు నరకం అనుభవించా.. నా ముఖాన్ని అద్దంలో చూసుకోలేదు

ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు. హీరోయిన్స్ కూడా దైర్యంగా బయటకు వచ్చి తమకు ఎదురైనా చేదు అనుభవాలను. ఇండస్ట్రీలో ఎదుర్కున్న లైంగిక వేధింపుల గురించి బహిరంగంగా మాట్లాడారు చాలా మంది నటీమణులు. యంగ్ హీరోయిన్స్ దగ్గర నుంచి సీనియర్ హీరోయిన్స్ వరకు తాము ఎదుర్కున్న లైంగిక వేధింపుల గురించి మాట్లాడారు. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ కూడా తాను ఎదుర్కున్న లైంగిక వేధింపుల గురించి షాకింగ్ విషయం చెప్పింది. ఓ నిర్మాత అవమానంతో 6 నెలలు నరకం అనుభవించా అని చెప్పి ఎమోషనల్ అయ్యింది ఆ సీనియర్ నటి. ఇంతకూ ఆ అందాల భామ ఎవరు.? ఆమెను వేధించిన నిర్మాత ఎవరు.?

ఇది కూడా చదవండి : దీన స్థితిలో టాలీవుడ్ కమెడియన్..! నీ ముఖం కూడా గుర్తులేదంటూ అవమానాలు

ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న వారిలో విద్యాబాలన్ ఒకరు. తెలుగు ప్రేక్షకులకు కూడా ఆమె సుపరిచితురాలే.. విద్యాబాలన్ నటించిన డర్టీ పిచ్చర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. ఈ సినిమాలో ఆమె నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలోనూ నటించి మెప్పించింది విద్య.

ఇది కూడా చదవండి : 400 కోట్ల హీరోయిన్.. కానీ ఇప్పటికీ అద్దె ఇంట్లోనే.. కారణం ఇదేనా..?

ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉన్న విద్య తాజాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. ఓ నిర్మాత తనను అవమానించాడని తెలిపింది విద్య బాలన్. తాజాగా విద్య మాట్లాడుతూ.. ఓ నిర్మాత తన దగ్గరకు వచ్చి అసభ్యకరంగా ప్రవర్తించాడని తెలిపింది. ఒక సినీ నిర్మాత నాతో చాలా దారుణంగా ప్రవర్తించాడు. నా దగ్గరకు వచ్చి అసభ్యకరంగా, ఛండాలంగా పిలిచాడు. ఆ మాటలు నన్ను ఎంతో బాధపెట్టాయి. ఆ అవమానంతో నేను దాదాపు ఆరు నెలలపాటు నా ముఖాన్ని అద్దంలో చూసుకోలేదు. ఆ మాటలు నన్ను ఎంత బాధపెట్టాయంటే నేను ఆరు నెలల పాటు నరకం అనుభవించా.. ఆ మాటలకూ నేను మనిషిని కాలేకపోయా.. ఇలాంటి సంఘటనలు నా కెరీర్ లో చాలానే జరిగాయి. అదే టైం లో బాడీ షేమింగ్ కూడా చేశారు అని తెలిపింది విద్య బాలన్. అలాగే నాకు మలయాళంలో ఆఫర్ వచ్చింది. ఆ సమయంలో సినిమా ఆగిపోయింది. దాంతో అందరూ నన్ను దురదృష్టవంతురాలు అన్నారు. ఎదో కారణంతో సినిమా ఆగిపోతే దానికి నేను కారణం అన్నారు. ఇలాంటివి నా కెరీర్ లో చాలా జరిగాయి అని చెప్పుకొచ్చారు విద్య బాలన్.

ఇది కూడా చదవండి : హిట్ కొట్టి ఆరేళ్ళు.. మూడు సినిమాలు చేస్తే ఒకే ఒక్క హిట్.. కానీ క్రేజ్ మాత్రం పీక్

 

View this post on Instagram

 

A post shared by Vidya Balan (@balanvidya)

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

​సినిమా ఇండస్ట్రీలో తరచుగా వినిపిస్తున్న సమస్య.. క్యాస్టింగ్ కౌచ్. చాలా మంది హీరోయిన్స్ తాము ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాం అని షాకింగ్ విషయాలను బయట పెట్టారు. దైర్యంగా మీడియా ముందుకు వచ్చి తాము ఎదుర్కున్న సమస్యలను బయట పెడుతున్నారు. కొంతమంది అవకాశాల కోసం లోబర్చుకుంటారు అని చెప్పి షాక్ ఇచ్చారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *