అది ఉన్మాద చర్య

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *

నెతన్యాహూ విచారణపై ట్రంప్‌ ఆగ్రహం
ఇజ్రాయిల్‌కు ఆర్థిక సాయం నిలిపివేస్తానంటూ బెదిరింపులు
అవినీతి కేసు విచారణ
రెండు వారాలు వాయిదా
ప్రధాని రాజీనామాకు బెన్నెట్‌ డిమాండ్‌
వాషింగ్టన్‌ :
అవినీతి ఆరోపణలకు సంబంధించి ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజిమిన్‌ నెతన్యాహూపై జరుగుతున్న విచారణను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి తప్పుపట్టారు. ఈ విచారణ ఓ ‘ఉన్మాద చర్య’ అంటూ ఇజ్రాయిల్‌ ప్రాసిక్యూటర్లపై మండిపడ్డారు. హమాస్‌తో చర్చలు జరపడంలోనూ, ఇరాన్‌తో పెరుగుతున్న ఉద్రిక్తతలను నివారించడంలోనూ నెతన్యాహూకు ఉన్న సామర్ధ్యాన్ని ఇజ్రాయిల్‌ అధికారులు తక్కువగా అంచనా వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్‌ సోషల్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు.

‘అదుపు తప్పిన ప్రాసిక్యూటర్లు బిబి నెతన్యాహూ విషయంలో ఉన్మాదంతో వ్యవహరిస్తున్నారు. వారి చేష్టలు మధ్యప్రాచ్యంలో శాంతి ప్రయత్నాలకు విఘాతం కలిగిస్తాయి’ అని తెలిపారు. ‘ఇజ్రాయిల్‌ను రక్షించేందుకు, ఆ దేశానికి మద్దతుగా నిలిచేందుకు అమెరికా ఏటా అనేక బిలియన్‌ డాలర్లు ఖర్చు చేస్తోంది. ఇజ్రాయిల్‌ అధికారులు ఇలాగే వ్యవహరిస్తే ఆ మద్దతుకు కట్టుబడి ఉండబోము’ అని ట్రంప్‌ హెచ్చరిక ధోరణిలో చెప్పారు. కాగా అవినీతి ఆరోపణలపై నెతన్యా హూను సోమవారం విచారించాల్సి ఉన్నప్పటికీ న్యాయవాదుల అభ్యర్థన మేరకు జెరుసలేం జిల్లా కోర్టు విచారణను రెండు వారాలు వాయిదా వేసింది. ఇరాన్‌తో 12 రోజుల పాటు జరిగిన ఘర్షణల నేపథ్యంలో దేశ భద్రత దృష్ట్యా విచారణను వాయిదా వేయాలని న్యాయవాదులు కోరారు.
పార్లమెంట్‌ సభ్యుల కన్నెర్ర
అవినీతి కేసులో తనపై జరుగుతున్న విచారణను నిలిపివేసేలా నెతన్యాహూ ప్రాంతీయ ఘర్షణలను సాకుగా చూపుతున్నారని ఇజ్రాయిల్‌ పార్లమెంట్‌ సభ్యులు ఆరోపిం చారు. ఇజ్రాయిల్‌తో పాటు మా చిన్నారుల భవిష్య త్తును నెతన్యాహూ ఫణంగా పెడుతున్నారని డెమొక్రాట్స్‌ పార్టీ సభ్యుడు నామా లజీమి ధ్వజమెత్తారు. నెతన్యాహూ ఇజ్రాయిల్‌ ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరి స్తున్నారని యెష్‌ అతిద్‌ పార్టీ సభ్యుడు కరైన్‌ ఎల్హరార్‌ విమర్శించారు.
నెతన్యాహూ రాజీనామాకు ఇదే సమయ మని మాజీ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్‌ హితవు పలికారు. ‘ఆయన ఇప్పటికే 20 సంవత్సరాలు పదవిలో ఉన్నారు. ఇది చాలా ఎక్కువ. ఇజ్రాయిల్‌ సమాజం విడిపో వడానికి ఆయనే బాధ్యుడు’ అని అన్నారు. రాజకీయాలకు కొంత విరామం ఇచ్చిన బెన్నెట్‌ ఇప్పుడు మళ్లీ క్రియా శీలకంగా వ్యవహరించాలని యోచిస్తున్నారు. ఎన్నికలలో నెతన్యాహూను మరోసారి ఢకొీనేందుకు ఆయన సిద్ధపడుతున్నారు.

The post అది ఉన్మాద చర్య appeared first on Navatelangana.

​నెతన్యాహూ విచారణపై ట్రంప్‌ ఆగ్రహంఇజ్రాయిల్‌కు ఆర్థిక సాయం నిలిపివేస్తానంటూ బెదిరింపులుఅవినీతి కేసు విచారణరెండు వారాలు వాయిదాప్రధాని రాజీనామాకు బెన్నెట్‌ డిమాండ్‌వాషింగ్టన్‌ : అవినీతి ఆరోపణలకు సంబంధించి ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజిమిన్‌ నెతన్యాహూపై జరుగుతున్న విచారణను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి తప్పుపట్టారు. ఈ విచారణ ఓ ‘ఉన్మాద చర్య’ అంటూ ఇజ్రాయిల్‌ ప్రాసిక్యూటర్లపై మండిపడ్డారు. హమాస్‌తో చర్చలు జరపడంలోనూ, ఇరాన్‌తో పెరుగుతున్న ఉద్రిక్తతలను నివారించడంలోనూ నెతన్యాహూకు ఉన్న సామర్ధ్యాన్ని ఇజ్రాయిల్‌ అధికారులు తక్కువగా అంచనా వేస్తున్నారని
The post అది ఉన్మాద చర్య appeared first on Navatelangana. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *