అప్పట్లో కాల్ సెంటర్లో పని చేసింది.. ఆతర్వాత స్టార్ హీరోయిన్.. ఇప్పుడు ఇలా..

Follow

ఇప్పుడు హీరోయిన్స్ హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటూ దూసుకుపోతున్నారు. పాన్ ఇండియా సినిమాలు చేస్తూ స్టార్ డమ్ ను అందుకుంటున్నారు. అంతే కాదు కొంతమంది హీరోయిన్స్ అవ్వకముందు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. ఎన్నో ఇబ్బందులను, కష్టాలను ఎదుర్కున్న తర్వాత హీరోయిన్ గా అవకాశాలు అందుకొని.. వచ్చిన ఛాన్స్ లను సద్వినియోగం చేసుకున్నవారు ఎంతో మంది ఉన్నారు. అలాగే కొంతమంది మాత్రం సక్సెస్ సాధించలేకపోయారు. వారిలో ఈ బ్యూటీ ఒకరు. సినిమాల్లోకి రాక ముందు కాల్ సెంటర్ లో పని చేసింది ఈ అమ్మడు. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ చిన్నది. బడా హీరోల సరసన సినిమాలు చేసింది. కానీ ఇప్పుడు అదృష్టం కలిసి రాక అవకాశాల కోసం ఎదురుచూస్తుంది.
ఇది కూడా చదవండి : దీన స్థితిలో టాలీవుడ్ కమెడియన్..! నీ ముఖం కూడా గుర్తులేదంటూ అవమానాలు
ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? అచ్చం కత్రినా కైఫ్ లా ఉండే ఈ బ్యూటీ మరెవరో కాదు జరీన్ ఖాన్. జరీన్ ఖాన్, మహారాష్ట్రకు చెందిన సినిమా నటి. ఈ ముద్దుగుమ్మ . హిందీ, తమిళం, తెలుగు, పంజాబీ సినిమాలలో నటించింది ఈ అందాల భామ. 2019లో తెలుగులో వచ్చిన గోపీచంద్ హీరోగా నటించిన చాణక్య సినిమాలో ఏజెంట్ జుబెదా పాత్రను పోషించింది ఈ అమ్మడు.
ఇది కూడా చదవండి : 400 కోట్ల హీరోయిన్.. కానీ ఇప్పటికీ అద్దె ఇంట్లోనే.. కారణం ఇదేనా..?
సల్మాన్ ఖాన్ సహకారంతో జరీన్ ఖాన్ 2010లో వీర్ సినిమాలో యువరాణిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 2011లో వచ్చిన కామెడీ బ్లాక్‌బస్టర్ సినిమా రెడీలో ఐటెమ్ సాంగ్ లో స్టెప్పులేసి మెప్పించింది. 2012 రొమాంటిక్ కామెడీ హౌస్‌ఫుల్ 2లో గ్లామరస్ మోడల్ పాత్రతో గుర్తింపు పొందింది ఈ ముద్దుగుమ్మ. 2013లో నాన్ రాజవగా పొగిరెన్ సినిమాలో ఐటెమ్ సాంగ్ మాల్గోవ్తో తమిళ సినిమారంగంలోకి ప్రవేశించింది. 2014లో జాట్ జేమ్స్ బాండ్ సినిమాలో ప్రముఖ పాత్రలో నటించి, బాలీవుడ్‌కి తిరిగి ఎంట్రీ ఇచ్చింది. 2015 ఎరోటిక్ థ్రిల్లర్ హేట్ స్టోరీ 3 సినిమాలో నటించింది. 2019లో యాక్షన్ థ్రిల్లర్ చాణక్య సినిమాతో తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు అవకాశాల కోసం ఎదురుచూస్తుంది ఈ అమ్మడు.
ఇది కూడా చదవండి : హిట్ కొట్టి ఆరేళ్ళు.. మూడు సినిమాలు చేస్తే ఒకే ఒక్క హిట్.. కానీ క్రేజ్ మాత్రం పీక్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
చాలా మంది హీరోయిన్స్ సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు వివిధ రంగాల్లో పని చేశారు. కొంతమంది డాక్టర్స్‌గా మరికొంతమంది ఇతర ఉద్యోగాలు చేసి హీరోయిన్స్ గా మారి సినిమాలు చేశారు. వారిలో ఈ హీరోయిన్ ఒకరు. ఈ చిన్నది కూడా ఎంతో మంది హీరోయిన్స్ ఎన్నో సమస్యలు ఎదుర్కొని హీరోయిన్స్ గా అవకాశాలు అందుకున్నారు.