అమిత్‌షా దిష్టిబొమ్మ దహనం

Follow

ఖలీల్‌వాడి/వర్ని/బోధన్, జూన్ 30: జిల్లా కేంద్రంలో ఆదివారం కేంద్రహోం శాఖ మంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాల నాయకుల నిర్బంధంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ముందస్తు అరెస్టులను ఖండిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంతోపాటు బోధన్‌లో అమిత్ షా దిష్టిబొమ్మను సోమవారం దహనం చేశారు. వర్ని మండల కేంద్రంలో సీపీఎం నాయకులు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టి నిరసన తెలిపారు.
జిల్లా కేంద్రంలో చేపట్టిన కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ, సీపీఎం నాయకుడు పెద్ది వెంకట్రాములు, సీపీఐ నాయకుడు రఘురాం మాట్లాడారు. అమిత్‌షా పర్యటన సందర్భంగా వామపక్ష పార్టీల ప్రజాసంఘాల నాయకులను ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్లలో నిర్బంధించడాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. అమిత్ షా జిల్లా పర్యటనతో ప్రజలు, రైతులకు ఎలాంటి లబ్ధి చేకూరలేదన్నారు. పసుపు బోర్డుకు వెంటనే అధికారులు, సిబ్బందిని నియమించి, నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు.
జిల్లా కేంద్రంలో ఆదివారం కేంద్రహోం శాఖ మంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాల నాయకుల నిర్బంధంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.