అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి 

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *

– మాజీ ఎంపీపీ కోండ్రు మంజు భార్గవి, బీఆర్ఎస్ మండల కార్యదర్శి షేక్ బాబా 
– ఆళ్ళపల్లిలోని పలు జీపీ కార్యాలయాల ముందు బీఆర్ఎస్ నాయకుల ధర్నా 
నవతెలంగాణ – ఆళ్ళపల్లి 
: రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని ఆళ్ళపల్లి మాజీ ఎంపీపీ కోండ్రు మంజు భార్గవి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు షేక్ బాబా డిమాండ్ చేశారు. సోమవారం వారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగ కాంతారావు పిలుపు మేరకు ఆళ్ళపల్లి, అనంతోగు గ్రామాలతో పాటు పలు జీపీ కార్యాలయాల ముందు స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ధర్నాలు నిర్వహించి, ఎంపీడీవో డి.శ్రీనుతో పాటు ఆయా జీపీల కార్యదర్శులకు ఇందిరమ్మ పథకం ఇళ్లు, గ్రామ సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వర్షాకాలం దృష్ట్యా అన్ని జీపీలలో ⁠సైడు కాలవలో చెత్తా చెదారం, పిచ్చిమొక్కలు వెంటనే తొలగించి, బ్లీచింగ్ పౌడరు చల్లించాలన్నారు. ⁠మంచినీటి బావులు నీటి నిల్వ ఉన్నచోట తక్షణమే బ్లీచింగ్ పౌడర్ చల్లించాలని చెప్పారు. ఆయా గ్రామాల పురవీధుల్లో లేని చోట వీదిలైట్లు వెంటనే పెట్టించాలని తెలిపారు. అదేవిధంగా ⁠ఇండ్లలో ఉన్న చెత్తను ప్రతి రోజు సేకరించి, డంపింగ్ యార్డులకు తరలించాలని చెప్పారు. దోమల నివారణకు చర్యలు తీసుకొని ప్రజల ప్రాణాలను కాపాడాలన్నారు. పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్న గ్రామాలలో పేరుకు పోయిన అనేక సమస్యలను స్పెషల్ ఆఫీసర్లను ఏర్పాటు చేసి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పాలనను గాలికి వదిలి, అబద్దాలతో మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి, ప్రజల జీవితాలతో ఆడుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం కాలం వెలిబుచ్చుతున్నదని ఘాటుగా విమర్శించారు. ఆయా చోట్ల జరిగిన నిరసన కార్యక్రమాల్లో మాజీ ఉప సర్పంచ్ ఎండీ.ఖయ్యుం, బీఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు ఊకె భద్రం, బి.అర్.ఎస్  యూత్ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ ఆరిఫ్, బీఆర్ఎస్ మండల సోషల్ మీడియా అధ్యక్షుడు ఎండీ.ఆదం, పార్టీ మండల ప్రచార కార్యదర్శి ప్రవీణ్, కె.సతీష, కె.వెంకన్న, మధు, రాము, అంజత్, శైల, నవీన్, తౌహిద్, రమేష్, భాస్కర్, బుచ్చన్న, నరసింహారావు, స్వర్ణ, నాగమణి, రమణ, తదితరులు పాల్గొన్నారు.

The post అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి  appeared first on Navatelangana.

​– మాజీ ఎంపీపీ కోండ్రు మంజు భార్గవి, బీఆర్ఎస్ మండల కార్యదర్శి షేక్ బాబా – ఆళ్ళపల్లిలోని పలు జీపీ కార్యాలయాల ముందు బీఆర్ఎస్ నాయకుల ధర్నా నవతెలంగాణ – ఆళ్ళపల్లి : రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని ఆళ్ళపల్లి మాజీ ఎంపీపీ కోండ్రు మంజు భార్గవి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు షేక్ బాబా డిమాండ్ చేశారు. సోమవారం వారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగ
The post అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి  appeared first on Navatelangana. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *