అలాంటి సీన్స్‌లో నటించను!

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Rashmika Mandanna

అగ్ర కథానాయిక రష్మిక మందన్న ఇటీవల లండన్‌లో ‘వి ది విమెన్‌’ పేరుతో నిర్వహించిన ఓ ఉత్సవంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కెరీర్‌తో పాటు వ్యక్తిగత విషయాలపై నిర్మొహమాటంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేసింది. సినిమాల్లో స్మోకింగ్‌ సన్నివేశాలకు దూరంగా ఉంటానని, వ్యక్తిగతం జీవితంలో కూడా ధూమపానాన్ని అస్సలు ప్రోత్సహించనని చెప్పింది. ఒకవేళ స్మోకింగ్‌ సన్నివేశాల్లో నటించాల్సి వస్తే ఆ సినిమాను వదులుకుంటాను కానీ..ఎట్టి పరిస్థితుల్లో అలాంటి సీన్స్‌కు ఒప్పుకోనని తెలిపింది.

‘యానిమల్‌’ సినిమా కంటెంట్‌పై వచ్చిన విమర్శలపై రష్మిక మందన్న స్పందించింది. ప్రతీ మనిషిలో మరో కోణం ఉంటుందని, దానినే దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా చూపించారని చెప్పింది. ‘ప్రేక్షకులకు ఆ సినిమా నచ్చింది. అందుకే మంచి కలెక్షన్స్‌ వచ్చాయి. ఓ సినిమా నచ్చడం, నచ్చకపోవడం అనేది ప్రేక్షకుల వ్యక్తిగత అభిరుచుల మీద ఆధారపడి ఉంటుంది’ అని రష్మిక వివరించింది. ఇండస్ట్రీలో విజయాలు దక్కించుకోవడం కన్నా వాటిని నిలబెట్టుకోవడం చాలా కష్టమని ఆమె అభిప్రాయపడింది.

​అగ్ర కథానాయిక రష్మిక మందన్న ఇటీవల లండన్‌లో ‘వి ది విమెన్‌’ పేరుతో నిర్వహించిన ఓ ఉత్సవంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కెరీర్‌తో పాటు వ్యక్తిగత విషయాలపై నిర్మొహమాటంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేసింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *