అలాంటి సీన్స్ చేయాల్సి వస్తే.. సినిమా వదిలేస్తా.. స్టార్ హీరోయిన్ ఓపెన్ కామెంట్స్

Follow

చాలా మంది హీరోయిన్స్ ఎంతో కష్టపడి స్టార్స్ గా రాణిస్తున్నారు. టాలీవుడ్ లో ఎంతో మంది వరుస సినిమాలను చేస్తూ దూసుకుపోతున్నారు. వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు అందుకుంది.. అంతే కాదు పాన్ ఇండియా సినిమాలు చేసి పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది. రీసెంట్ డేస్ లో ఈ చిన్నది చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. దాంతో ఈ అమ్మడు ఇండస్ట్రీకి లక్కీ గర్ల్ గా మారిపోయింది. స్టార్ హీరోలు కూడా ఆమె సినిమా కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. సినిమాల్లో నాకు కొన్ని హద్దులు ఉన్నాయి. కొన్ని సీన్స్ చేయను.. ఆలాంటి సీన్స్ చేయాల్సి వస్తే ఇండస్ట్రీ వదిలేస్తా అని తెలిపింది. ఇంతకూ ఆమె ఎవరంటే..
నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ అమ్మడు తక్కువ సమయంలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. చలో సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. మహేష్ బాబు, సిద్ధార్థ్ మల్హోత్రా, దళపతి విజయ్, రణబీర్ కపూర్, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది రష్మిక. ఇప్పుడు ఈ అమ్మడుకి చేతినిండా సినిమాలు ఉన్నాయి. రష్మిక ఎలాంటి పాత్రనైనా అద్భుతంగా చేయగలదు. అలాగే ఎలాంటి డైలాగ్ నైనా చక్కగా పలకగలదు.
తాజాగా రష్మిక చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.. ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నటన విషయంలో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. రియల్ లైఫ్ లో అయినా.. సినిమాలలో అయినా సరే… తనకు స్మోక్ చేయడం అస్సలు నచ్చదని తెలిపింది రష్మిక. సినిమాల్లో కొన్ని లిమిట్స్ పెట్టుకున్నా.. వాటిలో స్మికింగ్ ఒకటి.. ఎట్టిపరిస్థితుల్లో స్మికింగ్ చేయను. ఒకవేళ సినిమాలో అలాంటి సీన్ చేయాల్సి వస్తే ఆ సినిమా వదిలేస్తా అని తెలిపింది. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇండస్ట్రీలో ఆమె ఓ స్టార్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్.. ఆమె కోసం స్టార్ హీరోలు కూడా ఎదురుచూస్తుంటారు. ఇటీవలే మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకుంది ఈ చిన్నది. తెలుగు, తమిళ్, హిందీ సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. ఈ చిన్నదాని తాజాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.