అవును, ప్రశ్నించవలసిందే..!

Follow

ప్రశ్నించవలసిందే
ఎవ్వరినైనా, ఎప్పుడైనా
ప్రశ్న కే ప్రశ్న
ప్రశ్న నీ నుంచి పుట్టిందా
నీ యింటి నుంచి పుట్టిందా
జన గళం నుంచి పుట్టిందా
తేడా కరతలామలకమే
చీకటిని చీల్చిన కాంతి కిరణాన్ని
ప్రశ్నిస్తవా
భూమి పొరలు మరిచిన నీటి ఊటలకు
నడకలు నేర్పిన భగీరథున్ని ప్రశ్నిస్తవా
నాగలి చాళ్ళలో సునాయాసంగా
విత్తనాల్ని రాల్చిన
రైతు వెన్నుపూస ధీమాని ప్రశ్నిస్తవా
తల పొగరు కింద తలెగరేసిన,
ఉచ్చరించలేని, పేరుకే లేని పేరుకు
బంగారు తొడుగుని అలంకరించిన
మూడక్షరాల ప్రభంజనం పేరుని ప్రశ్నిస్తవా
దాస్య నైజానికి స్వాతంత్య్ర రుచి
ఎట్టా తెలిసేది
మట్టి పిసకని చేతులకు చరిత్ర కోట
ఎట్టా ఆనేది
అల్లాటప్పా తనానికి ఆశయ సిద్దొక
నిందావాక్యం
పూర్ణ చంద్రున్ని కూడా గ్రహణం
వెంటాడుతదట
రాజకీయాలు జనానికి నచ్చవు
ప్రజాస్వామ్యం కోసం వారి ఎదురుచూపు?
సింహాసనాలు సింహం
వేటలనే తలపిస్తున్నయి
ఓటరు ఓటు లెక్కింపు వరకే
మలిపేయటానికి కాలం సుదీర్ఘం
సత్యం ఎక్కడ, ధర్మం ఎక్కడ
న్యాయదేవత త్రాసు ఎటువైపు మొగ్గేనో…
న్యాయం బరువే
ఎన్నీల కాలమే నిర్ణయిస్తుంది
మచ్చా, మరకా
నెపం చెంపకే గాటై అంటుకుంటది.
– విశ్వావసు
ప్రశ్నించవలసిందే
ఎవ్వరినైనా, ఎప్పుడైనా
ప్రశ్న కే ప్రశ్న
ప్రశ్న నీ నుంచి పుట్టిందా
నీ యింటి నుంచి పుట్టిందా
జన గళం నుంచి పుట్టిందా
తేడా కరతలామలకమే