ఆరోగ్యం కోసం ప్రతిరోజూ..
Follow
ఆధునిక జీవనశైలిలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా చాలా మంది ఆహారంపై ప్రత్యేక దష్టి పెట్టలేకపోతున్నారు. ముఖ్యంగా మార్కెట్‌లో లభించే ప్యాకేజింగ్ ఫూడ్స్ మీద మొగ్గు చూపుతున్నారు. ఇలా చేయడం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు ఎంచుకోవడంలో చాలా మంది పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఎలాంటి పదార్థాలు తీసుకోవాలి..? అనే ప్రశ్న తరచుగా ఇబ్బంది పెడుతుంటుంది. అయితే ఆరోగ్యకరమైన ఆహారం అంటే ఏంటీ..? వాటిని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి ఉపసమనం పొందవచ్చ..? అనే అంశం ఇప్పుడు తెలుసుకుందాం
ప్రోటీన్‌తో కూడిన ఆహార పదార్థాలు..
మీరు రోజు తీసుకునే ఆహారంలో ప్రోటీన్ అధిక మోతాదులో ఉండేలా చూసుకోవాలి. ప్రోటీన్ తో కూడిన పదార్థాలు తినడం ద్వారా మానసిక స్థితి మెరుగు పడుతుంది. అవి ఎక్కువగా గుడ్లు, పాలతో తయారు చేసిన పదార్థాల్లో లభిస్తుంది.
ఫైబర్ అధికంగా తీసుకోవాలి..
కొన్ని రకాల కూరగాయలు, పండ్లల్లో ఫైబర్ ఎక్కువగా లభిస్తుంది. పీచు పదార్థాలు తీసుకోవడం కారణంగా జీర్ణవ్యవస్థను మెరుగు పరచవచ్చు. ముఖ్యంగా బెండకాయ, బీరకాయ వంటివి తీసుకోవటం ద్వారా ఫైబర్‌ను పొందవచ్చు.
కాల్షియంతో కూడిన ఆహారం..
ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే కాల్షియంతో కూడిన ఆహారం తప్పకుండా తీసుకోవాలి. అందులోను విటమిన్ ణ, ఖ కలిగిన ఆహారం పదార్థాలు తీసుకోవడం చాలా అవసరం. ఇది అధికంగా గింజలు, తణధాన్యాలు, నారింజలో లభిస్తుంది.
The post ఆరోగ్యం కోసం ప్రతిరోజూ.. appeared first on Navatelangana.
ఆధునిక జీవనశైలిలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా చాలా మంది ఆహారంపై ప్రత్యేక దష్టి పెట్టలేకపోతున్నారు. ముఖ్యంగా మార్కెట్‌లో లభించే ప్యాకేజింగ్ ఫూడ్స్ మీద మొగ్గు చూపుతున్నారు. ఇలా చేయడం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు ఎంచుకోవడంలో చాలా మంది పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఎలాంటి పదార్థాలు తీసుకోవాలి..? అనే ప్రశ్న తరచుగా ఇబ్బంది పెడుతుంటుంది. అయితే ఆరోగ్యకరమైన ఆహారం అంటే ఏంటీ..? వాటిని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల
The post ఆరోగ్యం కోసం ప్రతిరోజూ.. appeared first on Navatelangana.