ఆరోగ్య సమస్యలతో కార్మికుల్లో కలవరం

Follow

- మానసిక ఒత్తిడి, ఆర్థిక సమస్యలే ప్రధాన కారణం
- ప్రతి 1000 మందిలో 458 మందికి పలు వ్యాధులు
హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని వివిధ కర్మాగారాలు, పలు పరిశ్రమలు, సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో పెరుగుతున్న అనారోగ్య సమస్యలు కలవరపెడుతున్నాయి. ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేయడం, అకడి వాతావరణం, పెరుగుతున్న మానసిక ఒత్తిడి, ఆర్థికపరమైన ఇబ్బందులతో వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నట్టు ఇటీవల కార్మికరాజ్య బీమా సంస్థ (ఈఎస్‌ఐసీ) వార్షిక నివేదికలో గణాంకాలతో సహా వెల్లడించింది. అనారోగ్య లక్షణాలు కనిపించినప్పటికీ.. ఉద్యోగ భద్రత లేకపోవడం, కుటుంబ పోషణభారంగా మారుతుందనే కారణంతో సరైన వైద్యం తీసుకోకపోవడంతో వ్యాధులు ముదిరి ప్రాణాలు కోల్పోతున్నట్టు నివేదికలో వివరించింది. 2024లో ఈఎస్‌ఐసీ పరిధిలోని దవాఖానలు డిస్పెన్సరీల్లో ప్రతి 1000 మంది కార్మికులకుగాను 458 మంది ఏదో ఒక వ్యాధితో చికిత్స తీసుకుంటున్నట్టు పేర్కొన్నది.
ఒకో కార్మికుడిపై వైద్యానికి రూ.3 వేల ఖర్చు
రాష్ట్రంలో బీమా సేవల పరిధిలో 15.53 లక్షల మంది కార్మికులు ఉన్నట్టు ఈఎస్‌ఐసీ వెల్లడించింది. వారి కుటుంబ సభ్యులతో కలిపి మొత్తం 72.69 లక్షల మంది వైద్యసేవలు పొందేందుకు అర్హులని పేర్కొన్నది. సగటున ఏటా ఒకో కార్మికుడిపై రూ.4,108 ఖర్చు చేసినట్టు తెలిపింది. 2024లో దవాఖానల్లో పలు కారణాలతో 5.5లక్షల మంది కార్మికులు చేరారని స్పష్టంచేసింది. దేశవ్యాప్తంగా ఏటా ఒకో కార్మికుడిపై వైద్యం కోసం సగటున రూ.3వేలు ఖర్చు చేస్తున్నదని వివరించింది.
రాష్ట్రంలోని వివిధ కర్మాగారాలు, పలు పరిశ్రమలు, సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో పెరుగుతున్న అనారోగ్య సమస్యలు కలవరపెడుతున్నాయి.