ఆలోచన వినూత్నం.. అందరికీ ‘పుస్తకం’

Follow

- కోటగిరి పాఠశాలలో బుక్ బ్యాంక్
- పాఠ్య పుస్తకాల కొరత తీరుస్తున్న ‘పుస్తక నిధి’
- కొత్తగా వచ్చే విద్యార్థులకూ అందుబాటులో బుక్స్
కోటగిరి, జూన్ 18: కోటగిరి జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టి అమలుచేస్తున్నారు. పాఠశాలలో పుస్తక నిధి ఏర్పాటు చేసి విద్యార్థులకు పాఠ్యపుస్తకాల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం బడిబాట కార్యక్రమంలో భాగంగా నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, దుస్తులు పంపిణీ చేస్తున్నారు.
కానీ ఈ పాఠశాలలో మాత్రం విద్యార్థులకు కొత్తవి అందిస్తూనే, గతేడాది తరగతులకు సంబంధించి పాత పాఠ్యపుస్తకాలు సేకరించి బుక్ బ్యాంకు ఏర్పాటు చేశారు. గతేడాది ఒక తరగతిలో ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా ప్రస్తుత తరగతి పాఠ్య పుస్తకాలను ప్రభుత్వం సరఫరా చేస్తున్నది. ఒకవేళ కొత్తగా అడ్మిషన్లు వస్తే పుస్తకాల కొరత ఏర్పడుతుంది. ‘పుస్తక నిధి’ ఏర్పాటు చేయడంతో పుస్తకాల కొరతకు తావులేకుండా పోయింది.
చదువుకు ఆటంకం కలుగొద్దని..
విద్యార్థులు పాఠ్యపుస్తకాలు లేక ఇబ్బందులు పడకూడదని కొన్నేండ్లుగా బుక్ బ్యాంక్ నిర్వహిస్తున్నాం. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు పుస్తకాలు సేకరించి ఒక గదిలో భద్రంగా ఉంచుతున్నాం. తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్ మీడియాలకు సంబంధిం చిన పుస్తకాలు సేకరిస్తున్నాం. విద్యార్థులతోపాటు పాలిటెక్నిక్, గురుకుల కళాశాలలో ప్రవేశాలకు లేదా ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారికి కూడా ఇస్తున్నాం.
– నాందేడ ్లశ్రీనివాసరావు, ప్రధానోపాధ్యాయుడు, కోటగిరి
కోటగిరి జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టి అమలుచేస్తున్నారు. పాఠశాలలో పుస్తక నిధి ఏర్పాటు చేసి విద్యార్థులకు పాఠ్యపుస్తకాల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం బడిబాట కార్యక్రమంలో భాగంగా నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, దుస్తులు పంపిణీ చేస్తున్నారు.