ఈలేగావ్ లో బీటీరోడ్డుకు శంకుస్థాపన
Follow
గ్రామానికి ఎమ్మెల్యే రూ.2 కోట్ల 20 లక్షల నిధులు మంజూరు
నవతెలంగాణ – మద్నూర్ : ఈలేగావ్ గ్రామానికి స్వతంత్రం నాటినుండి నేటి వరకు బిటి రోడ్డు లేదు. ఈ గ్రామ ప్రజల బాధలను అర్థం చేసుకొని జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు రూ.2 కోట్ల 20 లక్షల నిధులు మంజూరు చేయించారు. ఈ నేపథ్యంలో సోమవారం శంకుస్థాపన చేశారు. మా బాధలు ఎమ్మెల్యే అర్థం చేసుకుని బిటి రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించినందుకు కృతజ్ఞతలు అని గ్రామ ప్రజలు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
గతంలో ఎందరో ఎమ్మెల్యేలు వచ్చారు, వెళ్లారు. కానీ ఇలేగావ్ గ్రామ ప్రజల బాధలు ఏ ఒక్కరు పట్టించుకోలేదని, ప్రజా సమస్యల పరిష్కారమే నా లక్ష్యమని ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు తెలిపారు. బి టి రోడ్డు నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి కావడానికి ఎమ్మెల్యే ప్రత్యేకంగా చొరవ చూపుతానని హామీ ఇచ్చారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో డోంగ్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు బీటి రోడ్డు నిర్మాణం కాంట్రాక్టర్ బండు పటేల్ సంబంధిత శాఖ అధికారులు ఇలేగావ్ గ్రామస్తులు పాల్గొన్నారు.
The post ఈలేగావ్ లో బీటీరోడ్డుకు శంకుస్థాపన appeared first on Navatelangana.
గ్రామానికి ఎమ్మెల్యే రూ.2 కోట్ల 20 లక్షల నిధులు మంజూరునవతెలంగాణ – మద్నూర్ : ఈలేగావ్ గ్రామానికి స్వతంత్రం నాటినుండి నేటి వరకు బిటి రోడ్డు లేదు. ఈ గ్రామ ప్రజల బాధలను అర్థం చేసుకొని జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు రూ.2 కోట్ల 20 లక్షల నిధులు మంజూరు చేయించారు. ఈ నేపథ్యంలో సోమవారం శంకుస్థాపన చేశారు. మా బాధలు ఎమ్మెల్యే అర్థం చేసుకుని బిటి రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించినందుకు కృతజ్ఞతలు
The post ఈలేగావ్ లో బీటీరోడ్డుకు శంకుస్థాపన appeared first on Navatelangana.