ఈ ఉపాధ్యాయుడు అందరికీ ఆదర్శం

Follow

- తన ముగ్గురు పిల్లలను సర్కార్ బడిలో చదివిస్తున్న సిరికొండ కుమారస్వామి
స్టేషన్‌ఘన్‌పూర్, జూన్ 19 : తమ పిల్లలను కార్పొరేట్ పాశాలల్లో చదివిస్తున్నామని గొప్పగా చెప్పుకునే తల్లిదండ్రులు ఈ ఉపాధ్యాయుడిని ఆదర్శంగా తీసుకోవాలి. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం చాగల్లు గ్రామానికి చెందిన సిరికొండ కుమారస్వామి 24 ఏండ్లుగా స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు.
తన ముగ్గురు పిల్లలను తన పనిచేసే పాఠశాలలో చదివిస్తున్నారు. వైష్ణవ్, వైభవ్, వజ్రహసిని ఫస్ట్ క్లాస్ వరకు అంగన్‌వాడీకి పంపించారు. ఆ తరువాత ఇదే మండలంలోని నమిలిగొండ ప్రభుత్వ పాఠశాలలో 2023-24 సంవత్సరం వరకు పని చేసిన సమయంలో వారిని అదే పాఠశాలలో చదివించారు. అనంతరం గత సంవత్సరం పాంనూర్ యూపీఎస్‌కు బదిలీ కాగా తమ పిల్లలను అదే స్కూల్లో చేర్పించి అందరికీ ఆదర్శంగా నిలిచారు.
తమ పిల్లలను కార్పొరేట్ పాశాలల్లో చదివిస్తున్నామని గొప్పగా చెప్పుకునే తల్లిదండ్రులు ఈ ఉపాధ్యాయుడిని ఆదర్శంగా తీసుకోవాలి. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం చాగల్లు గ్రామానికి చెందిన సిరికొండ కుమారస్వామి 24 ఏండ్లుగా స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు.