ఈ వంకాయ తింటే ఎన్ని లాభాలో తెలుసా?

Follow
ఈ వంకాయలో అనేక పోషకాలు ఉన్నాయంట. ముఖ్యంగా శరీరానికి అవసరమయ్యే విటమిన్స్, మినరల్స్ ఎక్కువ మోతాదులో ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. అందువలన ఈ వంకాయను మనం మన ఆహారంలో చేర్చుకోవడం వలన ఇవి రక్తపోటు, క్యాన్సర్ వంటి వ్యాధులతో పోరాడటంలో కీలక పాత్ర పోషిస్తుందంట. అంతే కాకుండా శరీరాన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతుందని చెబుతున్నారు నిపుణులు.
ఈ రంగు వంకాయలో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అందువలన ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్, క్యాన్సర్, గుండె సమస్యలతో పాటు అనేక రకాల వ్యాధుల నుంచి కాపాడుతుందంట.యాంటీఆక్సిడెంట్లు , ఆంథోసైనిన్లు ఈ రాడికల్స్‌ను తొలగించడంలో సహాయపడతాయంట. అందుకే ప్రతి ఒక్కరూ తమ ఆహారంలో ఈ వంకాయను చేర్చుకోవాలంట.
అదే విధంగా, పలు అధ్యయనాల ప్రకారం డయాబెటీస్‌తో బాధపడే వారికి కూడా ఇది బెస్ట్ అంటున్నారు నిపుణులు. భారత దేశంలో చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. అయితే వంకాయలో పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది. అందువలన డయాబెటీస్ రోగులు దీనిని తమ ఆహారంలో చేర్చుకోవడం వలన డయాబెటీస్ వచ్చే ప్రమాదం తగ్గించుకోవచ్చునంట. ఎందుకంటే వంకాయలోనీ పీచు పదార్థం రక్తంలోని చక్కర స్థాయిలను తగ్గించడమే కాకుండా ఆరోగ్య కరమైన ఇన్సులిన్ పెంచడానికి సహాయపడుతుందంట.
ఇక ఎవరు అయితే బరువు తగ్గాలి అనుకుంటున్నారో వారు కూడా వంకాయను తినడం ఉత్తమం, ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది.మీరు బరువు తగ్గాలని లక్ష్యంగా పెట్టుకుని , మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహార పదార్థాల కోసం చూస్తున్నట్లయితే, వంకాయ చాలా బెస్ట్ అంట. ఇది తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ కలిగి ఉండటం వలన బరువును నియంత్రణలో ఉంచుతుంది.
అయితే వంకాయ తినడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని దుష్ఫప్రభావాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు, జీర్ణ సమస్యలతో బాధపడేవారు, అలాగే కిడ్నీలో రాళ్ల సమస్యలు ఉన్న వారు దీని దూరం ఉండటం మంచిదంట. అలాగే అలెర్జీ ఉన్న వారు కూడా వీలైనంత వరకు వంకాయ కర్రీ తినకూడదంట.
బైంగన్ అని పిలవబడే ఈ ఉదా రంగు వంకాయతో బోలేడు ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రతి ఒక్కరి ఇంటిలో ఈ వంకాయలు ఉంటాయి. దీంతో అనేక రకాల వంటకాలు చేసుకుంటారు. అయితే కొంత మంది మాత్రం వంకాయ తినడానికి ఎక్కువ ఇష్టపడరు. కానీ దీంతో బోలేడు ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవి ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.