ఉక్రెయిన్‌పై ఆ దేశ యువతనే ఉసిగొలుపుతున్న రష్యా

Follow

కీవ్: ఉక్రెయిన్‌పై ఉగ్రవాద దాడులు చేసేందుకు ఆ దేశ యువతనే రష్యా ఉపయోగించుకుంటున్నది. సోషల్ మీడియా జాబ్స్, క్రిప్టో పేమెంట్స్, బ్లాక్‌మెయిలింగ్ వంటివాటి ద్వారా పెద్ద ఎత్తున ఉక్రెయిన్ యువతను ఆకర్షిస్తున్నది. యుద్ధం పట్ల ఆగ్రహంతో ఉన్న ఉక్రెయినియన్లమని చెప్పుకుంటూ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటనలు ఇస్తూ, యువతను నియమించుకుంటున్నది.
ఉక్రెయిన్‌కు చెందిన ఎస్‌బీయూ సెక్యూరిటీ సర్వీస్ ఈ వివరాలను వెల్లడించింది. ఈ యువతకు సొమ్ము చెల్లించి, సైనిక వాహనాలు, కార్యాలయాలు, పోలీసు స్టేషన్లకు నిప్పు పెట్టడం, బాంబులు పెట్టించడం వంటి చర్యలకు రష్యా పాల్పడుతున్నట్లు ఎస్‌బీయూ ఆరోపించింది.
ఉక్రెయిన్‌పై ఉగ్రవాద దాడులు చేసేందుకు ఆ దేశ యువతనే రష్యా ఉపయోగించుకుంటున్నది. సోషల్ మీడియా జాబ్స్, క్రిప్టో పేమెంట్స్, బ్లాక్‌మెయిలింగ్ వంటివాటి ద్వారా పెద్ద ఎత్తున ఉక్రెయిన్ యువతను ఆకర్షిస్తున్నది.