ఉచిత ఆటో పర్మిట్లను అడ్డుకుంటే తాటతీస్తాం​

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Jac Leaders
  • తెలంగాణ రాష్ట్ర ఆటో రిక్షా డ్రైవర్ల సంఘాల జేఏసీ

రవీంద్ర భారతి, జూన్‌ 18: జీహెచ్‌ఎంసీ, ఓఆర్‌ఆర్‌ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే ఉచిత ఆటో పర్మిట్లను ప్రైవేట్‌ ఆటో ఫైనాన్సియర్లు అడ్డుకుంటే తాటతీస్తామని తెలంగాణ రాష్ట్ర ఆటో రిక్షా డ్రైవర్ల సంఘాల జేఏసీ హెచ్చరించింది. హైదరాబాద్‌, బషీర్‌బాగ్‌, దేశోద్ధారక భవన్‌లో బుధవారం జరిగిన విలేఖరుల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఆటో రిక్షా డ్రైవర్ల సంఘాల జేఏసీ కన్వీనర్‌ వెంకటేశం, ఎస్‌. అశోక్‌ (ఏఐటీయూసీ), వి. మారయ్య, మహేశ్‌ (బీఆర్‌టీయూ) తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వెంకటేశ్‌ మాట్లాడుతూ నేటికీ సుమారు 80 వేల ఆటో పర్మిట్లు ఆటో ఫైనాన్సియర్లు వద్ద ఉన్నాయని, ఆటో షోరూం ధర రూ. 2 లక్షల 70 వేలకు ఉంటే ఆటో ఫైనాన్సియర్లు ఆటో డ్రైవర్‌కు రూ. 5 లక్షలకు అమ్మి మధ్యలో రూ. 2 లక్షల 30 వేలు అదనంగా లాగుతున్నారన్నారు. ఉచిత ఆటో పర్మిట్లను అడ్డుకుంటే ఫైనాన్సియర్లు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఈ ప్రయత్నాలను ఆపకుంటే ఆటో ఫైనాన్సియర్లు కార్యాలయాలను వేలాది మంది ఆటో డ్రైవర్లతో ముట్టడిస్తామని వెంకటేశం హెచ్చరించారు.

​జీహెచ్‌ఎంసీ, ఓఆర్‌ఆర్‌ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే ఉచిత ఆటో పర్మిట్లను ప్రైవేట్‌ ఆటో ఫైనాన్సియర్లు అడ్డుకుంటే తాటతీస్తామని తెలంగాణ రాష్ట్ర ఆటో రిక్షా డ్రైవర్ల సంఘాల జేఏసీ హెచ్చరించింది.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *