ఉచిత వైద్య శిబిరాలకు విశేష స్పందన రావడం పట్ల హర్షం..
Follow
స్పందన హాస్పిటల్ అధినేత ..డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియా
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని పుట్టపర్తి రోడ్, బాబా గుడి వద్ద గల స్పందన హాస్పిటల్లో మూడు ఉచిత వైద్య శిబిరాలకు విశేష స్పందన రావడం పట్ల స్పందన హాస్పిటల్ అధినేత డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియాలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్పందన హాస్పిటల్ లో ఉచిత సంతాన శాంపల్య శిబిరమునకు డాక్టర్ ఆర్ లావణ్య సంతానం లేని దంపతులకు వివిధ వైద్య చికిత్సలతో పాటు, సంతానం కావడానికి తగిన సలహా సూచనలు, వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగిందన్నారు. ఈ శిబిరానికి 50 మంది దంపతులు పాల్గొనడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా గర్భకోశ వ్యాధుల వైద్య శిబిరంలో సంతాన సాఫల్యత, లాపారోస్కోపిక్ సర్జన్ డాక్టర్ వైస్ సోనియా గైనకాలజీ వారు గర్భవతులకు వైద్య చికిత్సలతో పాటు తీసుకోవలసిన జాగ్రత్తలను కూడా వివరించడం జరిగిందన్నారు. సంతానం కలుగని దంపతులను పరీక్షించి అవసరమైన వారికి స్కానింగ్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా గర్భకోస వ్యాధులు కలవారికి కూడా ఉచితంగా పరీక్షలు నిర్వహించామని తెలిపారు. తదుపరి ఉచిత ఊపిరితిత్తులు ,చాతి జబ్బుల వైద్య శిబిరమును నిర్వహించడం జరిగిందని తెలిపారు ఇందులో డాక్టర్ పూర్ణచంద్ర 65 మంది రోగులకు వైద్య చికిత్సలతో పాటు ఆరోగ్యంలో తీసుకోవలసిన జాగ్రత్తలను కూడా వివరించడం జరిగిందని తెలిపారు. మొత్తం మీద మూడు శిబిరాలకు 150 మంది రావడం, వారికి అన్ని వస్తువులు కూడా కల్పించడం జరిగిందని తెలిపారు. ఈ ఉచిత ఊపిరితిత్తుల, ఛాతి జబ్బుల వైద్య శిబిరంలో రోగులకు ఉచిత వైద్య పరీక్షలతో పాటు మందులను కూడా ఉచితంగా ఇవ్వడం జరిగిందని తెలిపారు. అవసరమైన వారికి వైద్య పరీక్షల్లో 50 శాతము రాయితీ కూడా ఇవ్వడం జరిగిందన్నారు. అలర్జీ, దగ్గు, ఆయాసము, ఆస్తమా జబ్బులకు, క్షయ, నిమోనియా, ఎలర్జీ బ్రామ్ కైటిష్, ఊపిరితిత్తులలో నీరు, చీము, రక్తము చేరుట, అలర్జీ పరీక్షల ద్వారా కారణం గుర్తించుట, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ ద్వారా ఊపిరితిత్తుల జబ్బు తీవ్రతను గుర్తించుట, శ్వాస కష్టమైన రోగులకు వెంటిలేటర్, హైప్లో ఆక్సిజన్, తదితర వాటికి చక్కటి వైద్య చికిత్సలను అందించడం మాకెంతో ఆనందాన్ని చేకూర్చిందని వారు తెలిపారు. హాయిగా గాలి పీల్చుకొని స్వేచ్ఛగా జీవించాలన్నదే మా లక్ష్యము అని వారు తెలిపారు. కావున ధర్మవరం పరిసర ప్రాంతాల వారు రోగాల పట్ల నిర్లక్ష్యం ఉండకుండా ఎప్పటికప్పుడు వైద్యులచే చికిత్సలను అందించుకొని, క్రమేన మందులను వినియోగించుకుంటే చక్కటి ఆరోగ్యం లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి మేనేజర్ బాబా ఫక్రుద్దీన్, దిల్దార్, సిబ్బంది పాల్గొన్నారు.
The post ఉచిత వైద్య శిబిరాలకు విశేష స్పందన రావడం పట్ల హర్షం.. appeared first on Visalaandhra.
స్పందన హాస్పిటల్ అధినేత ..డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియావిశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని పుట్టపర్తి రోడ్, బాబా గుడి వద్ద గల స్పందన హాస్పిటల్లో మూడు ఉచిత వైద్య శిబిరాలకు విశేష స్పందన రావడం పట్ల స్పందన హాస్పిటల్ అధినేత డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియాలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్పందన హాస్పిటల్ లో ఉచిత సంతాన శాంపల్య శిబిరమునకు డాక్టర్ ఆర్ లావణ్య సంతానం లేని దంపతులకు వివిధ వైద్య చికిత్సలతో
The post ఉచిత వైద్య శిబిరాలకు విశేష స్పందన రావడం పట్ల హర్షం.. appeared first on Visalaandhra.