ఉదయం లేవగానే ఈ పనులు చేయటం అలవాటు చేసుకోండి.. ఒత్తిడి దూరమై ప్రశాంతంగా ఉంటారు..​

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
ఉదయం లేవగానే ఈ పనులు చేయటం అలవాటు చేసుకోండి.. ఒత్తిడి దూరమై ప్రశాంతంగా ఉంటారు..

సూర్యోదయం ముందే లేవడం అలవాటు చేసుకోండి. దీనివల్ల మీకు రోజులో ఎక్కువ సమయం ఉందన్న ఫీలింగ్ కలుగుతుంది. ఒత్తిడి, ఆందోళన దరిచేరవు. ఆరోగ్యం బాగుంటుంది. ప్రతిరోజూ ఉదయం లేవగానే కృతజ్ఞత తెలుపుకోవడం మంచిది. మీకు మరో రోజు ప్రసాదించినందుకు ధన్యవాదాలు చెప్పుకోండి. దీనివల్ల మీ మనసు ఉల్లాసంగా ఉంటుంది. ఉదయం లేవగానే మీ బెడ్ సర్దుకోవడం మంచిది. దీనివల్ల మీ మనసు కుదుటపడుతుంది. మంచి పని చేశామన్న భావన ఉంటుంది. ఒత్తిడికి చెక్ పెట్టొచ్చు అంటున్నారు నిపుణులు.

ధ్యానం చేయడం ద్వారా మనసు ప్రశాంతంగా మారుతుంది. ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలు తగ్గుతాయి. ఒత్తిడి లేకుండా గడపొచ్చు. ప్రతిరోజూ కాసేపు వ్యాయామం చేయడం చాలా మంచిది. దీనివల్ల శరీరానికి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. దీంతో ఒత్తిడి దూరమవుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. అలాగే, ఉదయం లేవగానే ఓ గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి. వీలైతే నిమ్మరసం కలుపుకోండి. దీని ద్వారా రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు జీర్ణశక్తి బాగుంటుంది.

తేలికైన, హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ తింటే ఆరోగ్యంగా ఉంటారు. మంచి ఫుడ్ తిన్నామన్న ఫీలింగ్ ఉంటుంది. మనసు ఉత్తేజితమవుతుంది. సలాడ్స్, ఓట్స్, తాజా పండ్లు, కూరగాయలతో బ్రేక్‌ఫాస్ట్ తినడం మంచిది. ఉదయం లేవగానే చాలామంది టీ, కాఫీ తాగుతుంటారు. అయితే ఇది ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది. అందుకే వీటికి బదులు గ్రీన్ టీ, పెప్పరమింట్ టీ వంటి హెర్బల్ టీలు తాగండి. ఆరోగ్యంగా ఉంటారు. మీరు ఉదయం నిద్ర లేవగానే ఆ రోజు ఏం పనులు చేయాలో ఓ బుక్‌లో రాసుకోండి. దీనివల్ల పనులు సమయానికి పూర్తవుతాయి. ఒత్తిడి లేకుండా గడపొచ్చు.

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

​నేటి బిజీ బిజీ జీవితంలో ప్రతి ఒక్కరూ విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. అందుకే ఒత్తిడి లేని ప్రశాంతమైన రోజు కోసం ప్రతి ఒక్కరూ కొన్ని మంచి అలవాట్లను పాటించటం తప్పనిసరి అంటున్నారు ఆరోగ్య నిపుణులు అందులో భాగంగా ఇలాంటి కొన్ని పద్ధతులను పాటించటం మంచిదని సూచిస్తున్నారు. ఒత్తిడిని దూరం చేసి రోజంతా ఉల్లాసంగా ఉంచే అలాంటి అలవాట్లను ఇక్కడ చూద్దాం…  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *