ఉద్యమాలతోనే హక్కులు సాధ్యం

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *

– గిరిజన గూడాలపై అటవీశాఖ దాడులు అమానుషం : మాజీ ఎంపీ మిడియం బాబురావు
నవతెలంగాణ – ఏటూరునాగారం ఐటీడీఏ

ఉద్యమాలతోనే ఆదివాసీ గిరిజనుల హక్కులు సాధింపబడతాయని మాజీ ఎంపీ మిడియం బాబురావు అన్నారు. ఆదివారం ములుగు జిల్లా ఏటూర్‌నాగారం మండలకేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాల ఆవరణలో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (టీఎస్‌యూటీఎఫ్‌) ములుగు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శి గొప్ప సమ్మారావు అధ్యక్షతన ‘జీఓ-3 ప్రత్యామ్నాయం, ఎస్టీల వర్గీకరణ ఆవశ్యకత’ అనే అంశంపై నిర్వహించిన సెమినార్‌లో ఆయన మాట్లాడారు. షెడ్యూల్‌ ఏరియాలో అన్ని ఉద్యోగాలు ఆదివాసీలకే దక్కాలంటే అది కేవలం ఉద్యమాల ద్వారానే సాధ్యమన్నారు. జీఓ-3ను సుప్రీం కోర్టు మైదాన ప్రాంత ప్రజలతో సమానంగా చూస్తూ షెడ్యూల్‌ ఏరియాలో ఉన్న వాళ్లతో పోలుస్తూ కొట్టివేయడం సరైనది కాదన్నారు. జీఓ-3కి ప్రత్యామ్నాయంగా 5వ షెడ్యూల్‌ ఏరియాలో అన్ని ఉద్యోగాలు స్థానిక ఆదివాసీలకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఎస్టీల వర్గీకరణ జరిగితే లాభనష్టాలపై అందరూ ఆలోచన చేయాలన్నారు. అనంతనం రొయ్యూర్‌ పరిధి కొమురంభీం కోయగిరిజన గ్రామంలో ఇటీవల అటవీశాఖ అధికారులు దాడులు చేసి బీభత్సం సృష్టించిన విషయంపై సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులతో కలిసి ఆ గూడెంను సందర్శించారు. గిరిజనులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం మిడియం బాబురావు మాట్లాడుతూ కొన్నేండ్లుగా నివాసం ఉంటున్న గిరిజన గుడాలపై ముందస్తుగా ఎలాంటి సమాచారం లేకుండా దాడులు చేయడం దుర్మార్గమన్నారు. గిరిజనులకు ఎక్కడైనా నివసించే హక్కు ఉందన్నారు. గిరిజనులు పూర్తిస్థాయిలో హక్కులు సాధించుకునే అంతవరకు పోరాడాలన్నారు

The post ఉద్యమాలతోనే హక్కులు సాధ్యం appeared first on Navatelangana.

​– గిరిజన గూడాలపై అటవీశాఖ దాడులు అమానుషం : మాజీ ఎంపీ మిడియం బాబురావునవతెలంగాణ – ఏటూరునాగారం ఐటీడీఏఉద్యమాలతోనే ఆదివాసీ గిరిజనుల హక్కులు సాధింపబడతాయని మాజీ ఎంపీ మిడియం బాబురావు అన్నారు. ఆదివారం ములుగు జిల్లా ఏటూర్‌నాగారం మండలకేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాల ఆవరణలో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (టీఎస్‌యూటీఎఫ్‌) ములుగు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శి గొప్ప సమ్మారావు అధ్యక్షతన ‘జీఓ-3 ప్రత్యామ్నాయం, ఎస్టీల వర్గీకరణ ఆవశ్యకత’ అనే అంశంపై నిర్వహించిన సెమినార్‌లో
The post ఉద్యమాలతోనే హక్కులు సాధ్యం appeared first on Navatelangana. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *