ఉద్యోగాలు కల్పించాలని ఆందోళన

Follow

దామరచర్ల, జూన్ 30: మండలంలోని యాదాద్రి పవర్ ప్లాంటులో ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ సోమవారం వీర్లపాలెం గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు ప్లాంటులో ఉద్యోగవకాశాలు కల్పించాలని కోరుతూ మిర్యాలగూడలోని సబ్‌కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్న గ్రామస్తులను వాడపల్లి పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. మిర్యాలగూడ సీఐ ప్రసాద్, వాడపల్లి ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి వారితో చర్చించి రహదారిపై ఆందోళన చేయడం సరికాదని, సమస్యను అధికార్ల వద్ద చర్చించాలని విజ్ఞప్తి చేయడంతో వారు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ పవర్ ప్లాంట్ ఏర్పాటు సమయంలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో వీర్లపాలెంలో ఇం టికో ఉద్యోగం, లేదా ఐదు లక్షల పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారని, ఇంతవరకు ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. పలుమార్లు అధికార్లకు విన్నవించినా పట్టించుకోకపోవడంతో అధికార్ల దృష్టికి తీసుకెళ్లేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారని, తమ సమస్యను పరిష్కరించకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడ్తామని హెచ్చరించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని నాయబ్ తహసీల్దార్ సైదులకు అందజేశారు.
మండలంలోని యాదాద్రి పవర్ ప్లాంటులో ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ సోమవారం వీర్లపాలెం గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు ప్లాంటులో ఉద్యోగవకాశాలు కల్పించాలని కోరుతూ మిర్యాలగూడలోని సబ్‌కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్న గ్రామస్తులను వాడపల్లి పోలీసులు అడ్డుకున్నారు.