ఉద్యోగికి మూడేళ్ల జైలు

Follow

సిరిసిల్ల గాంధీ చౌక్, జూన్ 30: రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పీహెచ్‌సీలో సీనియర్ అకౌంటెంట్ బానోతు రమేశ్‌కు సర్కారు ఖజానాకు గండికొట్టిన ఘటనలో మూడేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.10వేల జరిమానా విధిస్తూ సిరిసిల్ల ప్రథమ శ్రేణి న్యాయమూర్తి ప్రవీణ్ సోమవారం తీర్పు చెప్పారు.
బానోతు రమేశ్ 2015 జనవరి నుంచి నవంబర్ మధ్య స్టాఫ్ నర్సులు మంజులత, అరుణ పేర్లతో నకిలీ జీతాల బిల్లులు తయారు చేసి రూ. 12,01,178 అక్రమంగా డ్రాచేసుకున్నాడు. దీనిపై పోలీసులు కేసు నమో దు చేసి, సాక్షాలు ప్రవేశపెట్టగా జడ్జి నిందితుడికి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.
రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పీహెచ్‌సీలో సీనియర్ అకౌంటెంట్ బానోతు రమేశ్‌కు సర్కారు ఖజానాకు గండికొట్టిన ఘటనలో మూడేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.10వేల జరిమానా విధిస్తూ సిరిసిల్ల ప్రథమ శ్రేణి న్యాయమూర్తి ప్రవీణ్ సోమవారం తీర్పు చెప్పారు.