ఎకరానికి వెయ్యి గజాలివ్వాలి

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Police Patrol
  • జిన్నాయగూడ భూబాధితుల డిమాండ్‌
  • జిన్నాయగూడలో పలు పరిశ్రమల కోసం సుమారు 800 ఎకరాలు సేకరణ
  • అందులో పట్టా, అసైన్డ్‌ పట్టా, కొందరు కబ్జాలో..
  • రెండు రోజులుగా జరుగుతున్న వెంచర్‌ పనులు
  • తమకు అదనంగా ఇండ్ల స్థలాలిచ్చిన తర్వాతే పనులను చేపట్టాలని అడ్డుకున్న పట్టా రైతులు
  • పోలీస్‌ పహారాలో సాగుతున్న పనులు

రంగారెడ్డి, జూన్‌ 30 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని మహేశ్వరం మండలం, జిన్నాయగూడ గ్రామంలో పోలీస్‌ పహారా మధ్య టీజీఐఐసీ వెంచర్‌ పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులను రైతులు అడ్డుకుంటారన్న ముందస్తు సమాచారంతో పోలీసులు భారీగా మోహరించారు. జిన్నాయగూడలో గత ప్రభుత్వం పలు పరిశ్రమల కోసం సుమారు 800 ఎకరాల భూములను సేకరించింది. అందులో పట్టా భూములతోపాటు అసైన్డ్‌ పట్టాలు, కొంతమంది కబ్జాలో కూడా ఉన్నారు. భూసేకరణకు ముందు భూములు కోల్పోయిన రైతులందరికీ టీజీఐఐసీ..పట్టా భూములన్న వారికి ఎకరాకు 600 గజాలు, అసైన్డ్‌ పట్టాలున్న వారికి 250 గజాలు, కబ్జాలో ఉన్న వారికి 150 గజాల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చింది.

ఇండ్ల స్థలాలిచ్చిన తర్వాతే సేకరించిన భూమికి ఫెన్సింగ్‌ వేయాలని జిన్నాయిగూడ రైతులు షరతు విధించారు. దీం తో టీజీఐఐసీ గ్రామ సమీపంలో ఉన్న మరికొం త భూమిని సేకరించి అందులో వెంచర్‌ ఏర్పా టుచేసి..ఆ వెంచర్‌లో భూములు కోల్పోయిన వారికి ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు సిద్ధమైంది. అందులో భాగంగానే గత రెండు రోజులుగా వెంచర్‌ పనులను ప్రారంభించేందుకు వెళ్లిన అధికారులకు కొంతమంది భూములు కోల్పోయిన పట్టా రైతులు తమకు ఎకరానికి వెయ్యి గజాల చొప్పున ఇవ్వాలని డిమాండ్‌ చేయగా.. 38 పట్టాలున్న రైతులు పనులకు అడ్డు తగులుతున్నారు. టీజీఐఐసీ మాత్రం ముందుగా ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకే భూములు కోల్పోయిన వారికి ఇండ్ల స్థలాలిస్తామని స్పష్టం చేసింది.

అదనంగా ఇండ్ల స్థలాలివ్వాలని..

టీజీఐఐసీ ఆధ్వర్యంలో బాధితులకు ఇండ్ల స్థలాలిచ్చేందుకు వెంచర్‌ పనులు సాగుతుండగా.. సోమవారం కొంతమంది పట్టా రైతులు తమకు అదనంగా ఇండ్ల స్థలాలివ్వాలని.. దీనిపై స్పష్టత ఇచ్చేవరకు పనులు చేయవద్దని అడ్డుకున్నట్లు తెలిసింది. ఈ విషయం మిగిలిన రైతులకు తెలి యడంతో.. తమ పొలాల్లో టీజీఐఐసీ కంచె వేర్పాటు చేస్తుండగా.. ఆ పనులను వారు అడ్డుకున్నారు. వెంటనే టీజీఐఐసీ అధికారులు, పోలీసులు వచ్చి వెంచర్‌ పనులను ప్రారంభించారు. అనంతరం రైతులు కూడా కంచె ఏర్పాటును అడ్డుకోకపోవడంతో పనులు సజావుగా సాగాయి. అయినప్పటికీ పోలీసు పహారా మాత్రం కొనసాగుతున్నది.

​జిల్లాలోని మహేశ్వరం మండలం, జిన్నాయగూడ గ్రామంలో పోలీస్‌ పహారా మధ్య టీజీఐఐసీ వెంచర్‌ పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులను రైతులు అడ్డుకుంటారన్న ముందస్తు సమాచారంతో పోలీసులు భారీగా మోహరించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *