ఎన్ఎంఎంఎస్ లో బిఎస్ఆర్ బాలుర ఉన్నత పాఠశాల జిల్లా ర్యాంకుల వర్షం…
Follow
హెడ్మాస్టర్ మేరీ వర కుమారి
విశాలాంధ్ర ధర్మవరం;; 2024వ సంవత్సరంలో 8వ తరగతి చదువుతూ ఎన్ఎంఎంఎస్ (నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్) పరీక్షల్లో సంజయ్ నగర్ లోని బిఎస్ఆర్ మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల 13 మంది విద్యార్థులు విజయ దుందుభి మోగించారని పాఠశాల హెచ్ఎం మేరీ వర కుమారి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా పాఠశాల జిల్లా స్థాయిలో ప్రధమ, ద్వితీయ ర్యాంకులలో రావడం గర్వించదగ్గ విషయమని తెలుపుతూ తమ సంతోషాన్ని తెలిపారు. 13 మంది స్కాలర్షిప్ కు ఎంపిక కాగా, అందులో వై చైతన్య ప్రసాద్ -139 మార్కులు, జిల్లాలో ప్రధమ ర్యాంక్, పి.జస్వంత్ 131 మార్కులతో జిల్లా రెండవ ర్యాంక్ సాధించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా హెడ్మాస్టర్ మేరీ వర కుమారి తో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పాఠశాల కమిటీ చైర్మన్, కమిటీ సభ్యులు విద్యార్థులకు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ 13 మందికి కేంద్ర ప్రభుత్వం 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వరకు ప్రతి సంవత్సరం 15000 చొప్పున విద్యార్థుల బ్యాంకు ఖాతాలోకి జమ కావడం జరుగుతుందన్నారు. మొత్తం మీద నాలుగు సంవత్సరాలు విద్యార్థులకు ఈ నగదు చదువుకు ఎంతగానో ఉపయోగపడుతుందని వారు తెలిపారు.
The post ఎన్ఎంఎంఎస్ లో బిఎస్ఆర్ బాలుర ఉన్నత పాఠశాల జిల్లా ర్యాంకుల వర్షం… appeared first on Visalaandhra.
హెడ్మాస్టర్ మేరీ వర కుమారివిశాలాంధ్ర ధర్మవరం;; 2024వ సంవత్సరంలో 8వ తరగతి చదువుతూ ఎన్ఎంఎంఎస్ (నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్) పరీక్షల్లో సంజయ్ నగర్ లోని బిఎస్ఆర్ మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల 13 మంది విద్యార్థులు విజయ దుందుభి మోగించారని పాఠశాల హెచ్ఎం మేరీ వర కుమారి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా పాఠశాల జిల్లా స్థాయిలో ప్రధమ, ద్వితీయ ర్యాంకులలో రావడం గర్వించదగ్గ విషయమని తెలుపుతూ తమ సంతోషాన్ని తెలిపారు.
The post ఎన్ఎంఎంఎస్ లో బిఎస్ఆర్ బాలుర ఉన్నత పాఠశాల జిల్లా ర్యాంకుల వర్షం… appeared first on Visalaandhra.