ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు నేతలు మృతి​

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Maoists Died
  • మృతుల్లో సీసీ సభ్యుడు గాజర్ల రవి, కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి భార్య అరుణ
  • మూడు రాష్ర్టాల్లో గాజర్ల రవిపై రూ.కోటి రివార్డు

కొత్తగూడెం ప్రగతి మైదాన్‌, జూన్‌ 18: భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆ పార్టీ అగ్రనేతలు ముగ్గురు మృతిచెందారు. ఈ ఘటన ఏపీ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లాలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం-మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు గ్రేహౌండ్స్‌ భద్రతా దళాలు కూం బింగ్‌ ఆపరేషన్‌ చేపట్టాయి. ఈ క్రమంలో తారసపడిన మావోయిస్టులు భద్రతా దళాలపైకి కాల్పులు జరిపారు.

వెంటనే అప్రమత్తమైన గ్రేహౌండ్స్‌ బలగాలు ఎదురుకాల్పులకు దిగడంతో ఇరువర్గాల మధ్య సుమారు రెండు గంటలపాటు భీకరపోరు జరిగినట్లు తెలుస్తోంది. భద్రతా దళాల ధాటికి తాళలేక మావోయిస్టులు కాల్పులు జరుపుతూనే అక్కడి నుంచి పారిపోయారు. అనంతరం ఘటనా స్థలం నుంచి ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, అంధ్రా-ఒడిశా బోర్డర్‌ స్పెషల్‌ జోనల్‌ కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్‌ ఉదయ్‌ అలియాస్‌ గణేశ్‌ అలియాస్‌ బిరుసు, ఏపీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు, ఏఓబీ సభ్యురాలు వెంకటరవి లక్ష్మీచైతన్య అలియాస్‌ అరుణ అలియాస్‌ రూపి కాగా.. మరొకరిని ఏరియా కమిటీ సభ్యుడు అంజుగా పోలీసులు గుర్తించారు.

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం వెలిశాల గ్రామానికి చెందిన గాజర్ల రవి(సీసీఎం)పై మూడు రాష్ర్టాల్లో కలిపి రూ.కోటి రివార్డు, ఏపీ రాష్ట్రం విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం కరకవానిపాలెం గ్రా మానికి చెందిన అరుణ(ఎస్‌జెడ్‌సీఎం)పై రూ.25 లక్షల రివార్డు ఉన్నాయి. ఈ ఏడాది జనవరి 21న ఛత్తీస్‌గఢ్‌-ఒడిశా సరిహద్దు గరియాబంద్‌ జిల్లా కులరీఘాట్‌ దండకారణ్యంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మృతిచెందిన కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి భార్యే అరుణ. శాంతి చర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ లేఖ విడుదల చేసిన ఈమె ఎన్‌కౌంటర్‌లో మృతిచెందారు.

మావోయిస్టు పార్టీలో ప్రస్తుతం కీలకంగా వ్యవహరిస్తున్న గాజర్ల రవి, అరుణ మృతి తో ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలినైట్లెంది. కేంద్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్ర ప్ర భుత్వం సైతం మావోయిస్టు పార్టీకి చెందిన అగ్రనేతలనే టార్గెట్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు మృతి అనంతరం కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్‌, రాష్ట్ర కమిటీ సభ్యుడు భాస్కర్‌, ఇప్పు డు గాజర్ల రవి, అరుణ వరుస ఎన్‌కౌంటర్లు ఆ పార్టీని చిన్నాభిన్నం చేసినట్లు తెలుస్తోంది.

​భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆ పార్టీ అగ్రనేతలు ముగ్గురు మృతిచెందారు. ఈ ఘటన ఏపీ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లాలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం-మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు గ్రేహౌండ్స్‌ భద్రతా దళాలు కూం బింగ్‌ ఆపరేషన్‌ చేపట్టాయి.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *