ఎయిర్‌పోర్టులో బాంబ్ ఉందంటూ..

Follow
X
Follow

- బేగంపేట విమానాశ్రయానికి బెదిరింపు కాల్
- పోలీసులు, మిలటరీ, డిజాస్టర్ ఫోర్స్‌తో విస్తృత తనిఖీలు
- బాంబ్ దొరకకపోవడంతో ఫేక్‌కాల్‌గా నిర్ధారించిన అధికారులు
బేగంపేట, జూన్ 18: బేగంపేట విమానాశ్రయానికి బుధవారం ఉదయం ఓ గుర్తుతెలియని అగంతుకుడి నుంచి బాంబు బెదిరింపు కాల్, మెయిల్ వచ్చింది. అప్రమత్తమైన బేగంపేట పోలీసులు.. మిలటరీతో కలిసి హుటాహుటిన ఎయిర్‌పోర్ట్‌కు చేరుకొని బాంబ్, డాగ్ స్కాడ్‌తో విమానాశ్రయంలో తనిఖీలు చేపట్టారు.
కొద్దిసేపటికి డిజాస్టర్ ఫోర్స్ కూడా విమానాశ్రయానికి చేరుకున్నారు. విస్తృత తనిఖీలు చేసిన అనంతరం ఎక్కడా బాంబు ఆచూకీ లభించలేదు. దీంతో ఎవరో కావాలనే ఫేక్ కాల్‌చేసి ఉంటారని.. నిందితుడిని గుర్తించి పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
బేగంపేట విమానాశ్రయానికి బుధవారం ఉదయం ఓ గుర్తుతెలియని అగంతుకుడి నుంచి బాంబు బెదిరింపు కాల్, మెయిల్ వచ్చింది. అప్రమత్తమైన బేగంపేట పోలీసులు.. మిలటరీతో కలిసి హుటాహుటిన ఎయిర్‌పోర్ట్‌కు చేరుకొని బాంబ్, డాగ్ స్కాడ్‌తో విమానాశ్రయంలో తనిఖీలు చేపట్టారు.