ఎవర్రా మీరంతా..! చేతులు పడగొట్టాలా? లేక ప్రాణమే తీయాలా? విడాకుల కోసం క్షుద్ర పూజలు..

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
ఎవర్రా మీరంతా..! చేతులు పడగొట్టాలా? లేక ప్రాణమే తీయాలా? విడాకుల కోసం క్షుద్ర పూజలు..

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌ గ్రామంలో విడాకుల కోసం వేరైటీ సన్నివేశం నడిచింది. క్షుద్రపూజారి విడాకులు చేపించే బాధ్యత నాదే అంటూ నమ్మబలికాడు. ఏది.. అంటే అదే చేస్తానంటూ.. నానా హంగామా చేశాడు. కామారెడ్డి జిల్లా రాజ్‌ఖాన్‌పేటకు చెందిన తాళ్లపల్లి ఆశ్రిత – వెంకటాపూర్‌కు చెందిన రాగుల హరిచరణ్‌ పెళ్లి జరిగింది. వీరి కాపురం సజావుగా సాగుతోంది.. ఎలాంటి విభేదాలు లేవు.. అన్యోన్యంగానే వారిద్దరి జీవితం కొనసాగుతోంది.. ఈ క్రమంలోనే.. ఆర్థికంగా కష్టాల్లో కూరుకుపోయిన ఆశ్రిత కుటుంబం, విడాకులు ఇస్తే కట్నపు డబ్బులు తిరిగి వస్తాయన్న ఆశతో, అప్పులు తీరుతాయన్న  ప్రయత్నాలు సాగాయి. కూతురికి విడాకులు ఇప్పించే ప్లాన్ చేస్తున్నారు. ఆమె మాత్రం విడాకులు ఇవ్వడానికి నిరాకరిస్తూ వస్తోంది. ఈ క్రమంలో క్షుద్రపూజారిని రంగంలోకి దించారు కుటుంబ సభ్యులు.. దీంతో క్షుద్రపూజారి సైతం వారితో బేరాలు కుదుర్చుకున్నాడు.. “హరిచరణ్‌ కాళ్లు చేతులు పడగొట్టాలా? లేక ప్రాణమే తీయాలా?” అని అడిగిన ఆ పూజారి మాట్లాతున్న వాయిస్‌ రికార్డులు బయటపడ్డాయి.. ఆ రికార్డు బయటపడగానే వెంకటాపూర్‌లో ఒక్కసారిగా కలకలం రేగింది.

అది విన్న హరిచరణ్‌ వెంటనే ఆందోళన చెంది.. ఆశ్రితతో కలిసి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.. “మాకు ప్రాణభయం ఉంది సార్‌.. చర్యలు తీసుకోండి” అంటూ కంప్లయింట్‌ ఇచ్చాడు. ఇప్పటికీ..ఈ పూజారితో భయంతో.. బయటకు వెళ్ళ లేకపోతున్నామని. ఎలాగైనా చర్యలు తీసుకోవాలంటూ కోరారు.

విడాకుల కోసం.. ఇలాంటి సంఘటనలు జరగడం ఇదే మొదటి సారి అని చెప్పుకోవచ్చు. అందరూ..విడాకులు జరగకుండా ఉండాలని కోరుకుంటే. ఇక్కడ మాత్రం.. కుటుంబసభ్యులు అందుకు వ్యతిరేకంగా ఉన్నారు. ఆర్థికంగా బలపడేందుకు ఇలాంటి నీచమైన పని చేస్తారా ? అంటూ నిలదీస్తున్నారు.

ఈ విషయంపై ఎస్ఐ రాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ విషయం తమకు సాయంత్రం తెలిసిందని.. విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. మంత్రాలకు చింతకాయలు రాలవన్న విషయం తెలిసినా.. ఇక్కడ క్షుద్ర పూజలకు..విడాకులకు మూడిపెట్టడం తీవ్ర చర్చకీ దారి తీసింది.. ఇదంతా కట్టుకథ అని తెలిసినా.. ఆ భార్య భర్త మాత్రం తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

​కామారెడ్డి జిల్లా రాజ్‌ఖాన్‌పేటకు చెందిన తాళ్లపల్లి ఆశ్రిత – వెంకటాపూర్‌కు చెందిన రాగుల హరిచరణ్‌ పెళ్లి జరిగింది. వీరి కాపురం సజావుగా సాగుతోంది.. ఎలాంటి విభేదాలు లేవు.. అన్యోన్యంగానే వారిద్దరి జీవితం కొనసాగుతోంది.. ఈ క్రమంలోనే.. ఆర్థికంగా కష్టాల్లో కూరుకుపోయిన ఆశ్రిత కుటుంబం, విడాకులు ఇస్తే కట్నపు డబ్బులు తిరిగి వస్తాయన్న ఆశతో, అప్పులు తీరుతాయన్న  ప్రయత్నాలు సాగాయి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *