ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఆదర్శ, శ్రీజన్ భట్టాచార్య
Follow
– 87 మందితో నూతన కమిటీ ఎన్నిక
– 16 మందితో కార్యవర్గం
– విద్యలో మతోన్మాదం, కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా పోరాటాలు
– నేడు బహిరంగ సభ..
– కేరళ సీఎం విజయన్ హాజరు
ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఆదర్శ ఎం.సాజీ, శ్రీజన్ భట్టాచార్య ఎన్నికయ్యారు. కేరళలోని కోజికోడ్ (పాలస్తీనా – సాలిడారిటీ నగర్)లో ఎస్‌ఎఫ్‌ఐ 18వ అఖిల భారత మహాసభలో నిర్మాణ నివేదికపై మూడు రోజులు చర్చలు జరిగాయి.
నవతెలంగా-న్యూఢిల్లీ బ్యూరో
ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఆదర్శ ఎం.సాజీ, శ్రీజన్ భట్టాచార్య ఎన్నికయ్యారు. కేరళలోని కోజికోడ్ (పాలస్తీనా – సాలిడారిటీ నగర్)లో ఎస్‌ఎఫ్‌ఐ 18 వ అఖిల భారత మహాసభలో ఆదివారం కార్యక్ర మాలు, నిర్మాణ నివేదికపై మూడు రోజుల చర్చ లకు ప్రధాన కార్యదర్శి మయూఖ్ బిశ్వాస్ సమా ధానం ఇచ్చారు. అనంతరం కొత్త కేంద్ర కార్య నిర్వాహక కమిటీ, అఖిల భారత ఆఫీస్ బేరర్లను మహాసభ ఎన్నుకుంది. 87 మందితో ఎస్‌ఎఫ్‌ఐ నూతన అఖిల భారత కమిటీ, 16 మందితో అఖి ల భారత కార్యవర్గం ఎన్నికయింది. ఉపాధ్యక్షులు గా సుభాష్ జాఖర్, టి.నాగరాజు, రోహిదాస్ యాదవ్, సత్యేష్ లేయువా, శిల్పా సురేంద్రన్, ప్రణవ్ ఖర్జీ, ఎం.శివప్రసాద్, సి.మృదుల ఎన్నిక య్యారు. సహాయ కార్యదర్శులుగా ఐషే ఘోష్, జి.అరవిందసామి, అనిల్ ఠాకూర్, కె.ప్రసన్నకు మార్, దేబాంజన్ దేవ్, పి.ఎస్ సంజీవ్, శ్రీజన్‌దేవ్, మహ్మద్ అతిక్ అహ్మద్‌గా ఎన్నికయ్యారు. ఆదర్శ్ ఎం. సాజి కేరళలోని కొల్లంలో చత్తన్నూర్‌కు చెంది న విద్యార్థి నాయకుడు. ఆయన ఎస్‌ఎఫ్‌ఐ కేరళ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, అఖిల భారత సంయుక్త కార్య దర్శి బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన ఢిల్లీ లోని జన్హిత్ లా కాలేజీలో చివరి ఏడాది ఎల్‌ఎల్‌బీ చదు వుతున్నారు. ప్రధాన కార్యదర్శి శ్రీజన్ భట్టాచార్య పశ్చిమ బెంగాల్‌లోని జాదవ్‌పూర్‌కు చెందిన విద్యార్థి నాయకుడు. ఆయన అఖిలభారత సం యుక్త కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన బెంగాల్ రాష్ట్ర కార్యదర్శిగా కూడా పని చేశారు. చరిత్రలో పోస్ట్‌గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు.
తెలంగాణ నుంచి ఆరుగురికి చోటు
టి.నాగరాజు, ఎస్.రజనీకాంత్, ఎం.మమత, ఎం.పూజ, కె.శంకర్, మహ్మద్ అతిక్ అహ్మద్ (హెచ్‌సీయూ)
ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదుగురికి చోటు
కె. ప్రసన్న కుమార్, పి.రామ్మోహన్, ఒ. రమేష్, పల్లవి, జాహిదా
విద్యలో మతోన్మాదం, కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా పోరాటాలు
పాలస్తీనా-సాలిడారిటీ నగర్‌లోని సీతారాం ఏచూరి, నేపాల్ దేవ్ భట్టాచార్య మంచ్ లో జరిగిన మూడు రోజుల సమావేశం విద్యా రంగాన్ని వ్యాపా రీకరణకు వ్యతి రేకంగా, గవర్నర్‌లను ఉపయోగించి ఉన్నత విద్యారంగాన్ని కాషాయీకరించే చర్యలకు వ్యతిరేకంగా దేశంలోని విద్యార్థుల పోరాటాలకు దిశానిర్దేశం చేసే నిర్ణయాలను తీసుకుంది. ‘విద్య ఒక హక్కు, ఐక్యతే మార్గం, బహుత్వమే బలం’ అనే నినాదాన్ని ముందుకు తెచ్చిన ఈ మహా సభలో దేశంలో విద్యారంగాన్ని ప్రభావితం చేసే అంశాలపై చర్చించారు. విద్య మతోన్మాదం, కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా ఈ మహాసభ చాలా బలమైన పోరాటాలకు పిలుపునిచ్చింది.
నేడు బహిరంగ సభ.. హాజరుకానున్న ముఖ్యమంత్రి విజయన్
18వ ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత మహాసభ సోమవారం భవిష్యత్తు పోరాటాలు, పోరాటా లకు సంఘీభావం ప్రకటించడంతో విద్యా రంగంలో కాషాయీకరణ, విభజన రాజకీయా లకు వ్యతిరేకంగా పోరాటాలకు లాంచ్ ప్యాడ్ తో ముగియనుంది. ఐదు లక్షల మంది విద్యా ర్థులు పాల్గొనే విద్యార్థి ప్రదర్శన మలబార్ క్రిస్టియన్ కళాశాల ప్రాంగణం నుంచి ప్రారంభ మవుతుంది. తీరప్రాంతంలోని కేవీ సుధీష్ నగర్‌లో బహిరంగ సభను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రారంభిస్తారు.
The post ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఆదర్శ, శ్రీజన్ భట్టాచార్య appeared first on Navatelangana.
– 87 మందితో నూతన కమిటీ ఎన్నిక– 16 మందితో కార్యవర్గం– విద్యలో మతోన్మాదం, కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా పోరాటాలు– నేడు బహిరంగ సభ..– కేరళ సీఎం విజయన్ హాజరుఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఆదర్శ ఎం.సాజీ, శ్రీజన్ భట్టాచార్య ఎన్నికయ్యారు. కేరళలోని కోజికోడ్ (పాలస్తీనా – సాలిడారిటీ నగర్)లో ఎస్‌ఎఫ్‌ఐ 18వ అఖిల భారత మహాసభలో నిర్మాణ నివేదికపై మూడు రోజులు చర్చలు జరిగాయి.నవతెలంగా-న్యూఢిల్లీ బ్యూరోఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత నూతన అధ్యక్ష, ప్రధాన
The post ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఆదర్శ, శ్రీజన్ భట్టాచార్య appeared first on Navatelangana.