ఎస్సై భార్య బలవన్మరణం.. అత్తింటి వేధింపులే కారణమని ఆరోపణలు.. కేసు నమోదు

Follow

జూలూరుపాడు, జూన్ 30 : ఖమ్మంలో పనిచేసే రైల్వే ఎస్సై భార్య గడ్డి మందుతాగి బలవన్మరణానికి పాల్పడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. అత్తింటి వేధింపులతోనే తమ కుమార్తె మృతిచెందినట్టు కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం సుభాష్‌చంద్రబోస్‌నగర్ కాలనీకి చెందిన రాజేశ్వరి(34)ని ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం రాములుతండాకు చెందిన బానోత్ రాణాప్రతాప్‌కు ఇచ్చి వివా హం జరిపించారు. వివాహ సమయం లో భారీగా కట్నకానుకలు ఇచ్చారు.
వీరికి ఇద్దరు కాగా, జూలూరుపాడు ఎస్సైగా రాణాప్రతాప్ పనిచేసిన సమయం నుంచి రాజేశ్వరి జూలూరుపాడులో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నది. కొంతకాలంగా రాజేశ్వరిని భర్త, అత్త, మామ, బావ వేధిస్తున్నారు. ఈ క్రమంలో జూన్ 25న రాజేశ్వరి గడ్డిమందు తాగింది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను హైదరాబాద్‌కు తరలించగా, చికిత్సపొందుతూ 29న మృతిచెందింది. తన కుమార్తె ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.
ఖమ్మంలో పనిచేసే రైల్వే ఎస్సై భార్య గడ్డి మం దుతాగి బలవన్మరణానికి పాల్పడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. అత్తింటి వేధింపులతోనే తమ కుమార్తె మృతిచెందినట్టు కుటుంబ సభ్యులు ఆరోపించారు.