ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలను పీవీఎన్ మాధవ్‌కు అప్పగించిన పురంధేశ్వరి

Follow

AP BJP PVN Madhav: ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటన, బాధ్యతలు అప్పగించే కార్యక్రమం జరిగింది. నూతన అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ పేరును ఏపీ బీజేపీ అధ్యక్ష ఎన్నికల నిర్వాహకుడిగా వ్యవహరించిన కర్ణాటక ఎంపీ, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు పీసీ మోహన్ ప్రకటించారు. అనంతరం ఎన్నికైనట్లు ధ్రువీకరణ పత్రం అందజేశారు. ఆ తరువాత తన నుండి పీవీఎన్ మాధవ్‌కు అధ్యక్ష బాధ్యతలను బదలాయిస్తూ పార్టీ జెండాను ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అందజేశారు.
ఈ సందర్భంగా పీసీ మోహన్ మాట్లాడుతూ.. బీజేపీ అనేది ఒక సిద్ధాంతం కోసం పనిచేస్తుంది. రాష్ట్ర అధ్యక్షుడు అయినా, జాతీయ అధ్యక్షుడు అయినా ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నుకుంటాం. నాయకులు, కౌన్సిల్ సభ్యుల అభిప్రాయాలకు విలువనిస్తామని అన్నారు. కానీ, కాంగ్రెస్ పార్టీలో అంతా వన్ మ్యాన్ షో కనిపిస్తుంది. వారికి నచ్చిన వారు, చెప్పు చేతల్లో ఉండేవారే అక్కడ అధ్యక్షులు అవుతారు. కాంగ్రెస్ లో నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలకు విలువ ఉండదు. క్యాడర్ తో సంబంధం లేకుండా కాంగ్రెస్ లో రాష్ట్ర, జాతీయ అధ్యక్షులుగా ఎంపిక చేస్తారు. కానీ, బీజేపీలో అంతా ప్రజాస్వామ్యం ప్రకారం ఎంపిక జరుగుతుందని పీసీ మోహన్ అన్నారు.
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.