ఏప్రిల్‌ 1నుంచి జనగణన

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *

– హౌస్‌లిస్టింగ్‌ ప్రారంభం
న్యూఢిల్లీ:
2027 జనగణన యొక్క తొలి దశ వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖలో జనగణన కమిషనర్‌, భారత రిజిస్ట్రార్‌ జనరల్‌ మృత్యుంజరు కుమార్‌ నారాయణ్‌ వెల్లడించారు. ఈ తొలి దశలో హౌస్‌లిస్టింగ్‌ ఆపరేషన్స్‌ (గృహాల జాబితా కార్యాకలాపాలు), హౌసింగ్‌ సెన్సన్‌ (గృహాల గణన) కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. దీనికి ముందు సూపర్‌వైజర్లు, ఎన్యూమరేటర్ల నియామకం, వారి పని పంపిణి రాష్ట్రాలు, జిల్లాల అధికారుల సహకారంతో జరుగుతుందని తెలిపారు. సాధారణంగా మన దేశంలో జనగణన రెండు దశల్లో నిర్వహిస్తారు. మొదటి దశలో గృహాల జాబితా కార్యకలాపాలు, రెండో దశలో జనాభా లెక్కింపు జరుగుతోంది. రాబోయే జనగణన రెండో దశ 2027 ఫిబ్రవరి 1 నుంచి జరగనుందని లేఖలో మృత్యుంజరు కుమార్‌ తెలిపారు. 2027 జనగణన దేశంలో 16వ జనగణన. స్వాతంత్య్రం తరువాత ఎనిమిదవది. ఈసారి కుల గణన కూడా జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అలాగే ఈ జనగణన కోసం ఇప్పటికే 36 ప్రశ్నలను ప్రభుత్వం సిద్ధం చేసింది. జనాభా లెక్కల కార్యక్రమంలో సుమారు 36 లక్షల మంది సిబ్బంది పాల్గొననున్నారు.

The post ఏప్రిల్‌ 1నుంచి జనగణన appeared first on Navatelangana.

​– హౌస్‌లిస్టింగ్‌ ప్రారంభంన్యూఢిల్లీ: 2027 జనగణన యొక్క తొలి దశ వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖలో జనగణన కమిషనర్‌, భారత రిజిస్ట్రార్‌ జనరల్‌ మృత్యుంజరు కుమార్‌ నారాయణ్‌ వెల్లడించారు. ఈ తొలి దశలో హౌస్‌లిస్టింగ్‌ ఆపరేషన్స్‌ (గృహాల జాబితా కార్యాకలాపాలు), హౌసింగ్‌ సెన్సన్‌ (గృహాల గణన) కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. దీనికి ముందు సూపర్‌వైజర్లు, ఎన్యూమరేటర్ల నియామకం, వారి
The post ఏప్రిల్‌ 1నుంచి జనగణన appeared first on Navatelangana. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *