ఏసీబీకి చిక్కిన విద్యుత్‌ ఎస్‌ఈ​

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Electrical Engineer
  • రూ. 80 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన నరేశ్‌

మహబూబాబాద్‌ రూరల్‌, జూన్‌ 18 : ఏసీబీ వల కు విద్యుత్‌ ఏఈ చిక్కాడు. కాంట్రాక్టర్‌ నుంచి రూ. 80 వేలు లంచం తీసుకుంటూ మహబూబాబాద్‌ జిల్లా విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ నరేశ్‌ బుధవారం తన నివాసంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ ఘటనపై వరంగల్‌ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య వివరాలు మీడియాకు వెల్లడించారు. జిల్లాలో 2024-25 సంవత్సరానికి మరిపెడ, కురవి మండలాల్లో ఎలక్ట్రికల్‌ మె యింటనైన్స్‌, రిపేర్‌కు సంబంధించి వర్క్స్‌కు టెండర్లు పిలవగా, జిల్లాకు చెందిన ఓ కాంట్రాక్టర్‌కు వచ్చింది.

అతనికి రూ. 20 లక్షల వరకు వర్క్స్‌ చేసేందుకు లిమిట్‌ ఉందని, ఇంకా కంటిన్యూషన్‌ వర్క్స్‌ ఉందని, దాని కోసం సంబంధిత ఏఈ, డీఈలు అనుమతి ఇ చ్చారు. ఫైల్‌ ఎస్‌ఈ నరేశ్‌ దగ్గర ఉందని సమాచారం తో అతడిని కాంట్రాక్టర్‌ కలవగా రూ. లక్ష డిమాండ్‌ చేశాడు. ఈ నెల 14న కాంట్రాక్టర్‌ ఎస్‌ఈ నరేశ్‌కు రూ. 20 వేలు ఇచ్చి పని అనుమతి ఇవ్వాలని బ్రతిమిలాడి నా నరేశ్‌ వినలేదు. మిగతా రూ. 80 వేలు ఇస్తేనే అనుమతిస్తానని కరాఖండిగా చెప్పాడు.

కాంట్రాక్టర్‌కు లంచం ఇవ్వడం ఇష్టం లేక వరంగల్‌ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. బుధవారం ఉదయం కాంట్రాక్టర్‌ ఎస్‌ఈ నరేశ్‌కు రూ. 80 వేలు లంచం ఇస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ సాంబ య్య తెలిపారు. ఎస్‌ఈ నరేశ్‌ని అదుపులోకి తీసుకున్నామని, గురువారం వరంగల్‌ ఏసీబీ కోర్టులో హాజ రు పరుస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏసీబీ సీఐలు ఎల్‌ రాజు, ఎస్‌ రాజు, సిబ్బంది పాల్గొన్నారు.

​ఏసీబీ వల కు విద్యుత్‌ ఏఈ చిక్కాడు. కాంట్రాక్టర్‌ నుంచి రూ. 80 వేలు లంచం తీసుకుంటూ మహబూబాబాద్‌ జిల్లా విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ నరేశ్‌ బుధవారం తన నివాసంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ ఘటనపై వరంగల్‌ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య వివరాలు మీడియాకు వెల్లడించారు.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *