ఐ లవ్ పాకిస్తాన్.. ఇండియా–పాక్ యుద్ధాన్ని ఆపింది నేనే : ట్రంప్​

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *

ఐ లవ్ పాకిస్తాన్.. ఇండియా–పాక్ యుద్ధాన్ని ఆపింది నేనే : ట్రంప్

Caption of Image.

వాషింగ్టన్: భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కామెంట్ చేశారు. ట్రంప్​తో తాను ఫోన్ లో మాట్లాడనని, పాక్​తో కాల్పుల విరమణను ఆయన ఆపలేదని చెప్పానంటూ ప్రధాని మోదీ స్పష్టం చేశారని భారత విదేశాంగ శాఖ బుధవారం ప్రకటన చేసిన కొన్ని గంటలకే అమెరికా అధ్యక్షుడు మళ్లీ అదే పాట పాడారు. 

‘‘అవును. యుద్ధాన్ని నేనే ఆపాను. ఐ లవ్ పాకిస్తాన్. మోదీ ఒక అద్భుతమైన వ్యక్తి. నిన్న రాత్రి నేను ఆయనతో మాట్లాడాను. ఇండియాతో మేం ట్రేడ్ డీల్ చేసుకోబోతున్నాం. కానీ భారత్, పాక్ మధ్య యుద్ధాన్ని మాత్రం నేనే ఆపాను” అని ట్రంప్ అన్నారు. బుధవారం మధ్యాహ్నం వైట్ హౌస్ లో పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కు విందు ఇచ్చిన సందర్భంగా ట్రంప్ మీడియాతో మాట్లాడారు. దౌత్యపరంగా  ముందడుగు వేసేందుకే పాక్ ఆర్మీ చీఫ్​తో సమావేశం అవుతున్నారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. 

‘‘పాక్ వైపు నుంచి యుద్ధం ఆపేలా చేయడంలో ఇతను అత్యంత పాత్ర పోషించిన వ్యక్తి” అని అన్నారు. భారత్ వైపు నుంచి మోదీ, ఇతరులు కీలక పాత్ర పోషించారని.. తాను మాత్రం రెండు దేశాల మధ్య యుద్ధం రాకుండా ఆపానన్నారు. కాగా, పాక్​ ఆర్మీ చీఫ్​ మునీర్​కు అమెరికా అధ్యక్షుడు 
ట్రంప్​ వైట్ హౌస్​లో ఆతిథ్యం ఇచ్చారు.
 

©️ VIL Media Pvt Ltd.

​ఐ లవ్ పాకిస్తాన్.. ఇండియా–పాక్ యుద్ధాన్ని ఆపింది నేనే : ట్రంప్  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *