ఓ గర్వం నిలబడేందుకు జరిగిన యుద్ధమే తమ్ముడు

Follow

‘ఓ మై ఫ్రెండ్’.. లవ్ డ్రామా. ‘మిడిల్‌క్లాస్ అబ్బాయి’(MCA).. ఫ్యామిలీ డ్రామా. ‘వకీల్‌సాబ్’.. కోర్ట్ రూమ్ డ్రామా. రాబోతున్న ‘తమ్ముడు’.. యాక్షన్ డ్రామా. ఇలా పొంతన లేని జానర్లలో సినిమాలు తీస్తూ దర్శకుడిగా తనకంటూ ఓ గుర్తింపును సాధించారు దర్శకుడు శ్రీరామ్‌వేణు. ఆయన తాజా సినిమా ‘తమ్ముడు’ ఈ నెల 4 నుంచి థియేటర్లలో సందడి చేయనున్నది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో ముచ్చటించారు.
ఓ దినపత్రికలో వచ్చిన ఆర్టికల్ స్ఫూర్తితో ‘తమ్ముడు’ కథ తయారు చేశాను. అక్క, తమ్ముళ్ల సెంటిమెంటే ఈ కథకు ప్రధానాంశమైనా ఇందులో అంతర్లీనంగా డిఫరెంట్ లేయర్స్ కూడా ఉంటాయి. ఒక గర్వం నిలబడటానికి జరిగిన యుద్ధమే ‘తమ్ముడు’ మూవీ. ఇందులో హీరో నితిన్ పాత్రతోపాటు లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ, స్వసిక విజయన్ పాత్రలు కూడా బలంగా ఉంటాయి. ‘విక్రమ్’లో కమల్‌హాసన్ పాత్ర మాదిరిగా, కథ ప్రకారమే పాత్రలన్నీ ట్రావెల్ అవుతుంటాయి. ఈ సినిమాలోని పోరాట సన్నివేశాల్లోనూ ఫీల్ ఉంటుంది. కథ నచ్చి బడ్జెట్ గురించి ఆలోచించకుండా, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ సినిమా బడ్జెట్, క్రియేటివ్ పరంగా అన్ని బాధ్యతలనూ దిల్‌రాజు నాకే అప్పగించారు. ముందు ఈ సినిమాను 8నెలల్లో పూర్తి చేయాలనుకున్నాం. కానీ రెండేళ్లు పట్టింది. సినిమా పూర్తయ్యాక దిల్‌రాజుగారికి చూపించాం. ఆయన ఎక్స్‌పీరియన్స్ ప్రకారం కొన్ని సజెషన్స్ ఇచ్చారు. వాటిని ఇన్‌క్లూడ్ చేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాం.
ఈ కథలో విలువిద్య(ఆర్చరీ) చాలా కీలకం. విలువిద్య అభ్యసించాలంటే మెంటల్‌గా, ఫిజికల్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలి. గాలి వచ్చే దిశను, వేగాన్ని కూడా అంచనా వేయగలగాలి. ఇది అత్యంత పురాతన విద్య. శ్రీరాముడు, అర్జునుడి కాలాల నుంచి వస్తున్న విద్య ఇది. కేవలం ఈ సినిమాకోసం నితిన్ కొన్ని రోజులపాటు ఆర్చరీలో శిక్షణ పొందాడు. ఈ సినిమా కోసం అందరూ ఎంతో కష్టపడ్డారు. అడవుల్లో షూటింగ్ చేసేటప్పడు అందరికీ గాయాలయ్యాయి.
ఇందులో మా అమ్మాయి దిత్య ఓ కీరోల్ చేసింది. తనను కూడా ఆడిషన్స్ చేసే తీసుకున్నాం. ఈ సినిమాకోసం ఆమె 70రోజులు పనిచేసింది. సాంకేతికంగా ఈ సినిమా ఉన్నతంగా ఉంటుంది. అజనీష్ లోక్‌నాథ్ నేపథ్య సంగీతం, సమీర్‌రెడ్డి, సేదు, గుహన్‌ల సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్రధానబలం. సెన్సార్ ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇచ్చినా.. ఇందులో అనుకున్నంత హింస ఏం ఉండదు. అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకునే సినిమా ఇది.
‘ఓ మై ఫ్రెండ్’.. లవ్ డ్రామా. ‘మిడిల్‌క్లాస్ అబ్బాయి’(MCA).. ఫ్యామిలీ డ్రామా. ‘వకీల్‌సాబ్’.. కోర్ట్ రూమ్ డ్రామా. రాబోతున్న ‘తమ్ముడు’.. యాక్షన్ డ్రామా. ఇలా పొంతన లేని జానర్లలో సినిమాలు తీస్తూ దర్శకుడిగా తనకంటూ ఓ గుర్తింపును సాధించారు దర్శకుడు శ్రీరామ్‌వేణు. ఆయన తాజా సినిమా ‘తమ్ముడు’ ఈ నెల 4 నుంచి థియేటర్లలో సందడి చేయనున్నది.