కరప్షన్ చేసేది ఆమె.. చేయించేదీ ఆమె.. మంత్రి సీతక్కపై నియోజకవర్గ నాయకుడు రావి శ్రీనివాస్ ఫైర్
Follow

కాగజ్‌నగర్, జూన్ 30 : కరప్షన్ చేసేది ఆమె.. చేయించేది కూడా ఆమేనని సిర్పూర్ నియోజకవర్గ నాయకుడు రావి శ్రీనివాస్ మంత్రి సీతక్కపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఘాటుగా ఆరోపణలు చేశారు. సోమవారం కాగజ్‌నగర్ పట్టణంలోని గుంటూర్ కాలనీలోని తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలోని కొంత మంది అధికారులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని, అలాంటి అధికారులను మార్చాలని మంత్రికి చెప్పానని, వారితో ఏం లాలూచీ పడిందో తెలియదుగాని ఎలాటి చర్యలు తీసుకోలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు విశ్వప్రసాద్ తనపై కక్షకట్టి కట్టి లేనిపోనివి చెబితే మంత్రి నమ్మినట్లు తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రావి శ్రీనివాస్ సన్నిహితుడనే దూరం పెట్టారని, సమావేశాలకు పార్టీ కార్యక్రమాలకు పిలవకుండా పొమ్మనలేక పొగపెట్టారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని అబద్ధపు ప్రచారం చేశారని తెలిపారు. మీడియా ద్వారా ఇక్కడ జరుగుతున్న అవినీతి.. అక్రమాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, ప్రజల పక్షాన పోరాడుతానన్నారు. గతంలో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి లీడర్ లేకుండా పోయాడని, మళ్లీ అలాంటి రోజులు వస్తాయని చెప్పుకొచ్చారు. ఈ సస్పెన్షన్‌తో తనకు ఒరిగేమీ ఏమి లేదని స్పష్టం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తన సత్తా ఏమిటో చూపిస్తానని సవాల్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఆయన అభిమానులు, అనుచరులు పాల్గొన్నారు.
కరప్షన్ చేసేది ఆమె.. చేయించేది కూడా ఆమేనని సిర్పూర్ నియోజకవర్గ నాయకుడు రావి శ్రీనివాస్ మంత్రి సీతక్కపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఘాటుగా ఆరోపణలు చేశారు.