కలకత్తాకు రైళ్లు ఏవీ?

Follow

- ఉత్తర తెలంగాణపై కేంద్రం చిన్నచూపు
- కాజీపేట నుంచి బల్లార్షా దాకా ఒక్క రైలు లేదు
- ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పరిశ్రమల్లో
- వందలాది మంది బెంగాల్‌వాసులు
- దూరాభారంతో వస్త్రవ్యాపారులు, కూలీలకు తిప్పలు
పెద్దపల్లి, జూన్ 19 (నమస్తే తెలంగాణ): ఉత్తర తెలంగాణలోని అత్యధిక జిల్లాల్లో విస్తరించి ఉన్న రైల్వేస్టేషన్ల నుంచి కలకత్తాకు రైళ్లు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తర తెలంగాణలోని సగానికంటే ఎక్కువ ప్రాంతం కలిగిన కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల, మంచిర్యాల, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల నుంచి ఒక్కటంటే ఒక్క రైలు కూడా లేకపోవడంతో ఇక్కడి పరిశ్రమలు, ఇటుక బట్టీల్లో పనిచేసే బెంగాల్ వాసులు నరకం చూస్తున్నారు.
ప్రస్తుతం కాజీపేట నుంచి బల్లార్షా మార్గంలో ఒకటంటే ఒక రైలు కల్‌కత్తా మహానగరానికి లేదు. ఈ మార్గంలో కల్‌కత్తాకు ప్రతిరోజు రైలు నడపాలనే డిమాండ్ ఏండ్లుగా ఉన్నప్పటికీ పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. సిర్పూర్-కాగజ్‌నగర్ ప్రాంతంలో అనేక మంది బెంగాలీలు 20 ఏండ్లుగా స్థిరపడ్డారు. పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ ప్రాంతంలో అత్యధికంగానే ఉన్నారు.
వీరికోసం ఈ మార్గంలో రోజూ కలకత్తాకు రైలు నడపాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నది. చర్లపల్లి లేదా సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి ప్రతి రోజు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను వయా కాజీపేట-పెద్దపల్లి- మంచిర్యాల-సిర్పూర్ కాగజ్‌నగర్- బల్లార్షా- నగ్భిడ్-గోండియా-రాయ్ పూర్-బిలాస్‌పూర్- ఝౌర్సుగూడ- రూరేల- టాటానగర్- ఖరగ్‌పూర్ మీదుగా నడిపితే ఎంతో ప్రయోజనం ఉంటుందని బెంగాలీలు కోరుతున్నారు.
ఉత్తర తెలంగాణలోని అత్యధిక జిల్లాల్లో విస్తరించి ఉన్న రైల్వేస్టేషన్ల నుంచి కలకత్తాకు రైళ్లు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.