కలుషిత ఆహారంతిని విద్యార్థులకు అస్వస్థత !

Follow

- జమ్మికుంట సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో కలకలం
- ఇద్దరు విద్యార్థులను దవాఖానకు తరలించిన సిబ్బంది
జమ్మికుంట, జూన్ 30 : కలుషిత ఆహారంతిని ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంట సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో జరిగింది. పట్టణ శివారులోని సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో 300 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. సోమవారం ఉదయం పలువురు విద్యార్థులకు వాంతులు, విరేచనాలయ్యాయి. ఇందు లో 9 వ తరగతి విద్యార్థులు హర్షవర్ధన్, మణిచరణ్ తీవ్ర అస్వస్థతకు గురికాగా ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ రామ్‌సింగ్, హెల్త్ సూపర్‌వైజర్ శ్రీధరాచారి, హౌస్ మాస్టర్ రవీందర్ స్థానిక ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
హర్షవర్ధన్‌ను తల్లిదండ్రులు వచ్చి హుజూరాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లగా, మణిచరణ్‌ను తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లినట్టు ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ చెప్పారు. ఎంఈవో హేమలత దవాఖానలో విద్యార్థులను పరామర్శించారు. అనంతరం పాఠశాలను సందర్శించి వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు పంపించారు. వావిలాల పీహెచ్‌సీ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ను వివరణ కోరగా.. ఆదివారం తల్లిదండ్రులు తీసుకొచ్చి ఇచ్చిన, పిల్లలు కొనుగోలు చేసుకున్న తినుబండారాలను తినడంవల్లే విరేచనాలు అయ్యాయని, పిల్లలకు ఇబ్బంది ఏమీలేదని తెలిపారు.
కలుషిత ఆహారంతిని ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంట సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో జరిగింది. పట్టణ శివారులోని సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో 300 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. సోమవారం ఉదయం పలువురు విద్యార్థులకు వాంతులు, విరేచనాలయ్యాయి.