కల్యాణోత్సవం టికెట్ల కుదింపుపై ఆగ్రహం

Follow

సిటీబ్యూరో, జూన్ 30 (నమస్తే తెలంగాణ): ఆషాఢ మాసంలో ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే బల్కంపేట అమ్మవారి ఉత్సవాల నిర్వహణలో ప్రభుత్వ శాఖల నిర్లక్ష్యం భక్తుల పాలిట శాపంగా మారింది. లక్షలాది మంది తరలివచ్చే కల్యాణోత్సవం నిర్వహణపై దేవాదాయశాఖ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. ప్రధానంగా పాస్‌ల విషయంలో స్థానిక హస్తం నేతల ఒత్తిడి తీవ్రంగా ఉన్నట్లు సమాచారం. సోమవారం ఆలయ ప్రాంగణంలో స్థానికులకు ఈవోకు మధ్య పాసుల విషయంలో వాగ్వాదం జరిగడమే ఇందుకు ఉదాహరణ. గతంలో ఎన్నడూ లేనంతగా కల్యాణం టికెట్ల సంఖ్య 150కి తగ్గించడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మంత్రి పొన్నం, అనిల్‌కుమార్ యాదవ్, మేయర్, స్థానిక నేతలు కొందరు ఎవరికి వారే గ్రూపులు కట్టి దేవాలయంపై అజమాయిషీ చేస్తూ ఉత్సవ టికెట్ల నుంచి మొదలుకొని పాసుల వరకు గ్రూపు రాజకీయాలు జరుపుతున్నట్లు విమర్శలున్నాయి. దేవాలయ అభివృద్ధికి చేయూతనందించిన వారికి ఇచ్చే డోనర్ పాసుల సంఖ్యను కుదించడం, వీవీఐపీ పాసుల జారీలో అధికార పార్టీ పెద్దలకే పెద్దపీట వేయడంతో సమస్య మరీ ఎక్కువైంది. మంగళ, బుధ వారాల్లో జరిగే ఈ ఉత్సవ ఏర్పాట్లపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఆషాఢ మాసంలో ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే బల్కంపేట అమ్మవారి ఉత్సవాల నిర్వహణలో ప్రభుత్వ శాఖల నిర్లక్ష్యం భక్తుల పాలిట శాపంగా మారింది. లక్షలాది మంది తరలివచ్చే కల్యాణోత్సవం నిర్వహణపై దేవాదాయశాఖ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. ప్రధానంగా పాస్‌ల విషయంలో స్థానిక హస్తం నేతల ఒత్తిడి తీవ్రంగా ఉన్నట్లు సమాచారం.