కాంగ్రెస్‌లో కొత్త వారికి పెత్తనమా..?

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Ramesh
  • కార్యకర్తల సమావేశంలో పైనాన్స్‌ కమిషన్‌ సభ్యుడు రమేశ్‌

బషీరాబాద్‌, జూన్‌ 30 : 40 ఏండ్ల నుంచి కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నాం .. మమ్మల్ని నమ్ముకుని కార్యకర్తలున్నారు. నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన కొత్త వారి పెత్తనం ఏమిటీ.. పాత కార్యకర్తలకు అన్యాయం జరిగితే ధర్నాకు దిగుతామని ఫైనాన్స్‌ కమిషన్‌ సభ్యుడు రమేశ్‌మహారాజ్‌ హెచ్చరించారు. సోమవారం మండల కేంద్రంలోని ఓ రైస్‌ మిల్లులో జిల్లా పార్టీ అధ్యక్షుడు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అధ్యక్షతన కార్యకర్తల సమావేశం జరిగింది. ఇందులో రమేశ్‌మహారాజ్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లోకి నాయకులే వచ్చారు ఓటర్లు రాలేదన్నారు. గత అ సెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజార్టీని చూస్తే అర్థమవుతుందన్నారు.

ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి పాత కార్యకర్తలకు అన్యాయం జరిగితే తహసీల్దార్‌, ఎంపీడీవో, పార్టీ ఆఫీస్‌ ఎదుట ధర్నా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్డిఘణపూర్‌, గొట్టిగకలాన్‌ గ్రామాల్లో జరిగిన అన్యాయంపై ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినట్లు సమావేశంలో గుర్తు చేశారు. పాత కార్యకర్తలకు జరుగుతున్న అవమానంపై మిస్తే చర్చించేందుకు వస్తా.. లేదా దరఖాస్తు ఇస్తానని ఎమ్మెల్యేను ఉద్దేశించి పేర్కొన్నారు. మీరు వచ్చి రెండేండ్లు అవుతున్నది.. మేము గత 40 ఏండ్లుగా పార్టీలో ఉన్నామన్నారు. అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకూ గుర్తింపు ఉంటుందన్నారు. కార్యక్రమంలో పీసీసీ ఉపాధ్యాక్షులు వినోద్‌రెడ్డి, అధికార ప్రతినిధి నరేందర్‌, మండల నాయకులు పాల్గొన్నారు.

​40 ఏండ్ల నుంచి కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నాం .. మమ్మల్ని నమ్ముకుని కార్యకర్తలున్నారు. నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన కొత్త వారి పెత్తనం ఏమిటీ.. పాత కార్యకర్తలకు అన్యాయం జరిగితే ధర్నాకు దిగుతామని ఫైనాన్స్‌ కమిషన్‌ సభ్యుడు రమేశ్‌మహారాజ్‌ హెచ్చరించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *