కాంగ్రెస్ నాయకులు బీఆర్‌ఎస్ రాష్ట్ర మీడియా

Follow

- అధికార ప్రతినిధి పంజుగుల శ్రీశైల్‌రెడ్డి
బషీరాబాద్, జూన్ 30 : కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలు, నాయకుల అవినీతి, అక్రమాలతో మండల ప్రజలు విసిగిపోయారని బీఆర్‌ఎస్ రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి బాబాయి పంజుగుల శ్రీశైల్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మండల కేంద్రంలో స్థానిక నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. మండలంలో కాంగ్రెస్ నాయకులు మూడు ముఠాలుగా విడిపోయి అవినీతిలో వాటాల కోసం కొట్టుకుంటున్నారే తప్ప ప్రజల బాగోగులను పట్టించుకోవడంలేదని మండిపడ్డారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరంతరం ప్రజల కోసం పని చేయాలని సూచించారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో బషీరాబాద్ సర్పంచ్, ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలు గెలవాలన్నారు. రోహిత్‌రెడ్డి ఆధ్వర్యం లో త్వరలో మండల కార్యకర్తల సమావేశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ రవీందర్‌సింగ్, మాజీ కో-ఆప్షన్ మెంబర్ అబ్దుల్ రజాక్, మండల యూత్ ప్రెసిడెంట్ తాహెర్‌బాండ్, సీనియర్ నాయకులు నర్సిహుంలు, మాజీ ఎంపీటీసీ నాగేంద్రయ్య, సూరి, సునీల్ ప్రసాద్, మధుసూదన్‌రెడ్డి, శేఖర్, ఫయాజ్, జమీర్, ఆనంద్, రాజు, జహీర్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలు, నాయకుల అవినీతి, అక్రమాలతో మండల ప్రజలు విసిగిపోయారని బీఆర్‌ఎస్ రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి బాబాయి పంజుగుల శ్రీశైల్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మండల కేంద్రంలో స్థానిక నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు.