కాంగ్రెస్‌ నేతల చేతివాటం

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
02
  • ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న కాంగ్రెస్‌ నేతలు
  • ఇండ్ల నిర్మాణం ప్రారంభమైనా అందని స్టీల్‌, ఇసుక
  • రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

భువనగిరి అర్బన్‌, జూన్‌ 30: భువనగిరి పట్టణంలోని లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తామని చెప్పి, కాంగ్రెస్‌ నాయకులు వారి నుంచి రూ.20 వేలు వసూలు చేస్తున్నారని, డబ్బులిస్తేనే రేషన్‌ కార్డులు ఇప్పిస్తామని బెదిరిస్తున్నారంటూ బీఆర్‌ఎస్‌ పార్టీ పట్టణ, మండల శాఖల ఆధ్వర్యంలో సోమవారం బాబూజగ్జీవన్‌రామ్‌ చౌరస్తాలో ధర్నా చేసి ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ పార్టీ పట్టణ శాఖ అధ్యక్షుడు ఏవీ కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ పట్టణంలోని 18వ వార్డుకు చెందిన దాసారం అంజమ్మకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని, మంజూరైన ఆమె ఇంటికి రూ.ఐదు లక్షల లోన్‌ ఇపిస్తానంటూ అంజమ్మ కుమారుడు లక్ష్మణ్‌ వద్ద అదే వార్డు ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యుడు అందె నరేష్‌ రూ.20వేలు తీసుకున్నాడని, ఈ విషయాన్ని అంజమ్మ పలువురికి చెప్పి ఆవేదన వ్యక్తం చేసిందన్నారు.

ఈ విషయంపై జిల్లా ఉన్నతాధికారులు విచారణ చేపట్టి నిజమేనని తేలడంతో డబ్బులు వసూలు చేసిన కాంగ్రెస్‌ నాయకుడిపై క్రిమినల్‌ కేసు నమోదు చేశారని చెప్పారు. పట్టణంలో కాంగ్రెస్‌ నాయకులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా స్థానిక ఎమ్మెల్యే మౌనంగా ఉండటం ఏమిటని ప్రశ్నించారు.కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇందిరమ్మ ఇండ్లకు తక్కువ ధరకే స్టీల్‌, ఉచితంగా ఇసుక ఇస్తామని చెప్పి ఇవ్వడంలేదని, దీంతో ఇప్పటికే ఇండ్ల నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని, ఇలా చేయడం పేదలను మోసగించడమేనని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇందిరమ్మ కమిటీల సభ్యులు నిజమైన పేదలను ఎంపిక చేయకుండా వారి బంధువులు, కుటుంబ సభ్యులను ఎంపిక చేస్తున్నారని అన్నారు. ఇందిరమ్మ కమిటీల పేరుతో అవినీతికి పాల్పడుతున్నారని, ఆ కమిటీలను రద్దుచేసి ప్రభుత్వ అధికారులచేత లబ్ధిదారుల ఎంపిక చేపట్టి, అర్హులైన నిరుపేదలకు ఇండ్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయని, ప్రభుత్వం తక్కువ ధరకు ఇప్పిస్తామన్న స్టీల్‌, ఉచితంగా ఇస్తానన్న ఇసుకను అందజేయాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే లబ్ధిదారులు అధిక ధరలకు స్టీల్‌, ఇసుకను కొనుగోలు చేసుకుంటున్నారని, ఇలా చేయడంతో లబ్ధిదారులకు రూ.10 లక్షలు కూడా సరిపోవని అన్నారు.

కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షుడు కొలుపుల అమరేందర్‌, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ ఎనబోయిన ఆంజనేయులు, మండల అధ్యక్షుడు జనగాం పాండు, పట్టణ ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ బీరు మల్లయ్య, నాయకులు పెంట నర్సింహా, నువ్వుల సత్యనారాయణ, అతికం లక్ష్మీనారాయణ, అందె శంకర్‌, దిడ్డికాడి భగత్‌, ఖాజా అజీముద్దీన్‌, గోపాల్‌, కడారి వినోద్‌, పెంట నితీష్‌, నాగారం సూరజ్‌, యాస సంతోష్‌, సైదులు, ఇస్మాయిల్‌, గుర్రాల శ్రీశైలం, ఇండ్ల శ్రీను, శాగంటి నర్సింహా, తదితరులు పాల్గొన్నారు.

​భువనగిరి పట్టణంలోని లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తామని చెప్పి, కాంగ్రెస్‌ నాయకులు వారి నుంచి రూ.20 వేలు వసూలు చేస్తున్నారని, డబ్బులిస్తేనే రేషన్‌ కార్డులు ఇప్పిస్తామని బెదిరిస్తున్నారంటూ బీఆర్‌ఎస్‌ పార్టీ పట్టణ, మండల శాఖల ఆధ్వర్యంలో సోమవారం బాబూజగ్జీవన్‌రామ్‌ చౌరస్తాలో ధర్నా చేసి ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *