కునికిపాట్లు

Follow
X
Follow

కొందరు మధ్యాహ్నం వేళ కునికిపాట్లు పడుతుంటారు. అందులోనూ భోజనం తర్వాత నిద్రలోకి జారుకుంటారు. ఇంట్లోనే కాదు.. ఆఫీస్‌లో ఉన్నప్పుడూ.. అంతే! మెల్లిగా డెస్క్‌పైనే ఒరిగిపోతుంటారు. దాంతో.. దేనిమీదా దృష్టి నిలవక.. పనితీరుపై ప్రభావం చూపుతుంది. అయితే.. ఇలా పట్టపగలే నిద్ర రావడానికి కారణాలేంటి? దీన్ని ఎలా పరిష్కరించుకోవాలో నిపుణులు చెబుతున్న సలహాలు.
- ఈ స్మార్ట్ యుగంలో ఫోన్, కంప్యూటర్ లేనిదే ఏ పనీ చేయలేని పరిస్థితి. దాంతో చాలామంది రకరకాల గ్యాడ్జెట్స్‌తోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. రోజంతా ఆఫీస్‌లో కంప్యూటర్‌పై పనిచేస్తున్నారు. రాత్రిపూట స్మార్ట్‌ఫోన్‌లో తలదూర్చేస్తున్నారు. ఇలా రోజంతా బ్లూస్క్రీన్‌లోనే గడపడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. దీర్ఘకాలంలో నిద్రాభంగం కలుగుతున్నదని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, సాధ్యమైనంత మేరకు గ్యాడ్జెట్స్ వాడకాన్ని తగ్గించాలని సూచిస్తున్నారు.
- రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయడం కూడా.. పగటిపూట నిద్ర రావడానికి ఓ కారణమేనట. ఆలస్యంగా తినడం వల్ల జీర్ణవ్యవస్థపై భారం పడుతుంది. దాంతో నిద్ర పట్టడం కష్టమవుతుంది. అందుకే.. రాత్రినిద్రకు మూడునాలుగు గంటల ముందే భోజనం పూర్తిచేయాలని చెబుతున్నారు. ఇక రాత్రిపూట వేపుళ్లు, మాంసాహారం లాంటి భారీ ఆహారానికి దూరంగా ఉండటమే మంచిది.
- రాత్రిపూట కంటినిండా కమ్మటి నిద్రపోతే.. ఆఫీసులో కునికిపాట్లు తప్పుతాయి. ఇందుకోసం పడకగది పరిసరాలు కూడా బాగుండాలి. గదిలోకి వెలుతురు రాకుండా చూసుకోవాలి. ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవాలి. అప్పుడే జీవగడియారం బాగుంటుంది.
- కాఫీ, టీలలో ఉండే ‘కెఫిన్’.. నిద్రను దూరం చేస్తుంది. రాత్రిపూట, భోజనం తర్వాత వీటిని సేవిస్తే.. నిద్రకు భంగం వాటిల్లుతుంది. దాంతో, పగటిపూట నిద్ర ముంచుకొస్తుంది.
- రాత్రిపూట పుస్తకాలు చదివితే.. ఇట్టే నిద్ర పట్టేస్తుంది. గోరువెచ్చని పాలలో కొద్దిగా పసుపు కలిపి తీసుకున్నా.. హాయిగా నిద్రపడుతుంది. ఇక రాత్రిపూట కచ్చితంగా 6 నుంచి 8 గంటల నిద్రపోతే.. రోజంతా ఉత్సాహంగా గడుస్తుంది.
- ఆఫీస్‌లో విరామం లేకుండా పనిచేస్తే.. శరీరం అలసిపోతుంది. దాంతో మెదడు విశ్రాంతి కోసం నిద్రను ప్రోత్సహిస్తుంది. మధ్యాహ్న భోజనం అరగాలంటే జీర్ణవ్యవస్థకు ఎక్కువ శక్తి, రక్త సరఫరా అవసరం అవుతుంది. దాంతో శరీరం నీరసించి నిద్ర ముంచుకొస్తుంది. దీనికి చెక్ పెట్టాలంటే.. పని చేసేటప్పుడు గంటగంటకూ ఓ ఐదు నిమిషాలు విరామం తీసుకోవాలి. దాంతో మెదడు రిఫ్రెష్‌గా మారుతుంది. నిద్ర దూరమవుతుంది. మధ్యాహ్న భోజనం తర్వాత ఓ 10 – 15 నిమిషాలు నడిస్తే.. ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. ఇట్టే నిద్రపట్టేస్తుంది.
కొందరు మధ్యాహ్నం వేళ కునికిపాట్లు పడుతుంటారు. అందులోనూ భోజనం తర్వాత నిద్రలోకి జారుకుంటారు. ఇంట్లోనే కాదు.. ఆఫీస్‌లో ఉన్నప్పుడూ.. అంతే! మెల్లిగా డెస్క్‌పైనే ఒరిగిపోతుంటారు. దాంతో.. దేనిమీదా దృష్టి నిలవక.. పనితీరుపై ప్రభావం చూపుతుంది.