కూకట్‌పల్లి పరిధిలో రౌడీషీటర్ హత్య

Follow

మూసాపేట, జూన్ 30: కూకట్‌పల్లి పరిధిలో ఓ రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. సోమవారం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ రవి కుమార్ రెడ్డి వివరాలు వెల్లడించారు. అల్లాపూర్ పండిత్ నెహ్రూనగర్‌కు చెందిన సయ్యద్ షాహిద్( 23 )కు భర్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇతను గతంలో ఓ హత్య కేసులో జైలుకు వెళ్లివచ్చాడు. బోరబండకు చెందిన సాజిద్, సమీర్, మున్నా, పవన్, షాహిద్‌లు స్నేహితులు. సాహిద్, సాజిద్, మున్నాలు రౌడీ షీటర్లు. సాహిద్, సాజిద్‌ల మధ్య డబ్బు విషయంలో తరచుగా గొడవ జరుగుతుండేది. సాహిద్‌ను డబ్బులు ఇవ్వకపోతే చం పుతాని సాజిద్ బెదిరించాడు. పథకం ప్రకారం వడ్డేపల్లి ఎన్‌క్లేవ్ వెనుకనున్న ఖాళీ స్థలంలో ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో ఏర్పాటు చేసిన బర్త్‌డే పార్టీకి సా హిద్‌ను ఆహ్వానించారు. మద్యం తాగుతున్న క్రమంలో సాజిద్ బాటిల్‌తో సాహిద్ గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బహదూర్‌పురలో వాచ్‌మన్..
చాంద్రాయణగుట్ట, జూన్ 30: అనుమానాస్పద స్థితిలో ఓ కార్పొరేటర్ దగ్గర పని చేసే వాచ్‌మన్ దారు ణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన బహదూర్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం…బహదూర్‌పురా కార్పొరేటర్ హుస్సేన్ పాషా వద్ద ఇస్మాయిల్ (34) వాచ్‌మన్ గా పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి బయటకు వెళ్లిన అతను బహదూర్‌పుర ఫ్లైఓవర్ కింద సిగ్నల్ వద్ద హత్యకు గురయ్యాడు. సమాచారం తెలుసుకున్న ఫలక్‌నుమా ఏసీపీ జావీద్, ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వివరాలు సేకరించి..మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కూకట్‌పల్లి పరిధిలో ఓ రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. సోమవారం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ రవి కుమార్ రెడ్డి వివరాలు వెల్లడించారు.