కెఎల్ రాహుల్‌పై గురుతర బాధ్యత​

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *

India vs England

మన తెలంగాణ/ క్రీడా విభాగం: ఇంగ్లండ్‌తో (India vs England) జరిగే సిరీస్‌లో అందరి కళ్లు టీమిండియా స్టార్ ఆటగాడు కెఎల్ రాహుల్‌పైనే నిలిచాయి. సీనియర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో సిరీస్‌లో టీమిండియా బ్యాటింగ్ భారాన్ని మోయాల్సిన గురుతర బాధ్యత రాహుల్‌పై నెలకొంది. ఇంగ్లండ్‌పై భారత్ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. శుక్రవారం హెడింగ్లే వేదికగా తొలి టెస్టు ఆరంభం కానుంది. ఈ సిరీస్‌లో టీమిండియా దాదాపు సరికొత్త జట్టుతోనే బరిలోకి దిగుతోంది. సీనియర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమి తదితరులు జట్టుకు అందుబాటులో లేరు.

ఈ కీలక ఆటగాళ్లు లేకుండానే భారత్ ఈ సిరీస్‌కు సిద్ధమైంది. ఇలాంటి స్థితిలో ప్రస్తుతం జట్టులో ఏకైక అనుభవజ్ఞుడైన బ్యాటర్ కెఎల్ రాహుల్ ఒక్కడే. జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత అతనిపై నెలకొంది. ఈ సిరీస్‌లో (India vs England) యశస్వి జైస్వాల్‌తో కలిసి రాహుల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. ఇంగ్లండ్ సిరీస్ కోసం రాహుల్ ముందుగానే ఇక్కడికి వచ్చేశాడు. ఇండియా ఎ తరఫున అనాధికార టెస్టులో కూడా బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్‌లో రాహుల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇక ఐపిఎల్‌లోనూ రాహుల్ నిలకడైన బ్యాటింగ్‌తో అలరించాడు. ఇంగ్లండ్ సిరీస్‌లో కూడా సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం అతను టీమిండియాకు చాలా కీలకంగా మారాడు.

యువ ఆటగాళ్లతో కూడిన జట్టుకు మార్గదర్శకం చూపించాల్సిన బాధ్యత రాహుల్‌పై ఉంది. బ్యాటింగ్ భారాన్ని అతనే మోయక తప్పదు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, ఓపెనర్ యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, కరుణ్ నాయర్, రవీంద్ర జడేజాలు జట్టులోఉన్నా వీరికి రాహుల్‌కు ఉన్నంత అనుభవం లేదనే చెప్పాలి. రాహుల్‌ను తప్పిస్తే ప్రస్తుతం జట్టులో సీనియర్లు ఇద్దరే ఉన్నారు. వీరిలో ఒకరు జడేజా కాగా, మరోకరు స్పీడ్‌స్టర్ జస్‌ప్రిత్ బుమ్రా.

ఇలాంటి స్థితిలో పూర్తిగా కొత్త జట్టుతో బరిలోకి దిగుతున్న టీమిండియాకు రాహులే ప్రధాన ఆటగాడిగా మారాడు. అతను జట్టును ముందుండి నడిపించక తప్పదు. బ్యాటింగ్‌లో రాహుల్‌పై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఓపెనర్‌గా బరిలోకి దిగనున్న రాహుల్ చాలా సేపటి వరకు క్రీజులో నిలువాల్సిన అవసరం ఉంది. సహచరుల్లో ఆత్మవిశ్వాసం పెరగాలంటే రాహుల్ సాధ్యమైనంత వరకు మైడానంలో ఉండేందుకు ప్రయత్నించాలి. అప్పుడే టీమిండియా బ్యాటింగ్‌లో మెరుగైన ప్రదర్శన చేసే ఛాన్స్ ఉంటుంది. ఇందులో అతను ఎంత వరకు సఫలమవుతాడో వేచిచూడాల్సిందే.

​మన తెలంగాణ/ క్రీడా విభాగం: ఇంగ్లండ్‌తో (India vs England) జరిగే సిరీస్‌లో అందరి కళ్లు టీమిండియా స్టార్ ఆటగాడు కెఎల్ రాహుల్‌పైనే నిలిచాయి. సీనియర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో సిరీస్‌లో టీమిండియా బ్యాటింగ్ భారాన్ని మోయాల్సిన గురుతర బాధ్యత రాహుల్‌పై నెలకొంది. ఇంగ్లండ్‌పై భారత్ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. శుక్రవారం హెడింగ్లే వేదికగా తొలి టెస్టు ఆరంభం కానుంది. ఈ సిరీస్‌లో టీమిండియా  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *