కెప్టెన్ కూల్ కోసం.. ట్రేడ్‌మార్క్ లైసెన్స్‌కు ధోనీ దరఖాస్తు

Follow

కోల్‌కతా : ‘కెప్టెన్ కూల్’ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది భారత దిగ్గజ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ పేరు. అవును నరాలు తెగే ఉత్కంఠభరిత సమయాల్లోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకోవడంలో ధోనీ దిట్ట. తన సమయానుకూల నిర్ణయాలతో టీమ్‌ఇండియాకు ధోనీ ఎన్నో చిరస్మరణీయ విజయాలందించాడు.
అయితే కెప్టెన్ కూల్‌తో తనకున్న అనుబంధాన్ని మరింత ద్విగుణీకృతం చేసుకోవాలనుకున్న మహీ ట్రేడ్‌మార్క్ లైసెన్స్ కోసం తాజాగా దరఖాస్తు చేసుకున్నాడు. ఈ మేరకు కోల్‌కతాలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైనట్లు తెలిసింది. ఇది ఓకే అయితే ధోనీకి ‘కెప్టెన్ కూల్’ అరుదైన గౌరవంగా నిలిచిపోనుంది.
‘కెప్టెన్ కూల్’ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది భారత దిగ్గజ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ పేరు. అవును నరాలు తెగే ఉత్కంఠభరిత సమయాల్లోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకోవడంలో ధోనీ దిట్ట. తన సమయానుకూల నిర్ణయాలతో టీమ్‌ఇండియాకు ధోనీ ఎన్నో చిరస్మరణీయ విజయాలందించాడు.