కేటీఆర్‌పై తప్పుడు వార్తల ప్రసారం సరికాదు

Follow

ఎర్రుపాలెం, జూన్ 29: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్న టీవీ చానల్స్‌పై చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ మండల కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. కేటీఆర్ రాష్ట్రంపై ఒక మంచి అవగాహన ఆలోచన ఉన్న నాయకుడని, కేసీఆర్ అమ్ముల పొదిలో ఉన్న బ్రహ్మస్త్రం లాంటి వాడని, కేటీఆర్‌పై తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్న టీవీ చానల్స్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇకనైనా వాస్తవాలను తెలుసుకొని మసులుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో మాజీ జడ్పీటీసీ శీలం కవిత, మండల కార్యదర్శి యన్నం శ్రీనివాసరెడ్డి, మల్లికార్జున్‌రెడ్డి, శ్రీపాలశెట్టి తిరుపతిరావు, బొర్రా నరసింహారావు, కూరపాటి నాగేశ్వరరావు, గద్దల శ్రీనివాసరావు, షేక్ మస్తాన్‌వలీ, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.
కేటీఆర్‌పై అసత్య ప్రచారాలు మానుకోవాలి
కారేపల్లి, జూన్ 29: బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై మహాటీవీ చేసిన అసత్య ప్రసారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీఆర్‌ఎస్వీ జిల్లా నాయకుడు జూపల్లి రాము తెలిపారు. కారేపల్లి మండల కేంద్రంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మహాన్యూస్ ఛానల్‌పై దాడి చేశారని బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను అక్రమంగా అరెస్టు చేయడం సరి కాదన్నారు. మళ్లీ ఇలాంటివి జరిగితే బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు.
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్న టీవీ చానల్స్‌పై చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ మండల కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. కేటీఆర్ రాష్ట్రంపై ఒక మంచి అవగాహన ఆలోచన ఉన్న నాయకుడని, కేసీఆర్ అమ్ముల పొదిలో ఉన్న బ్రహ్మస్త్రం లాంటి వాడని, కేటీఆర్‌పై తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్న టీవీ చానల్స్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.