కేదార్నాథ్‎లో విషాదం.. కొండచరియలు విరిగిపడి ఇద్దరు మృతి​

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *

కేదార్నాథ్‎లో విషాదం.. కొండచరియలు విరిగిపడి ఇద్దరు మృతి

Caption of Image.

రుద్ర ప్రయాగ్(ఉత్తరాఖండ్): ఉత్తరాఖండ్‎లో విషాదం చోటు చేసుకుంది. కేదార్ నాథ్ ఆలయానికి వెళ్లే ట్రెక్కింగ్ రూట్‎లో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. బుధవారం ఉదయం 11.20 గంటలకు జంగిల్ చట్టి ఘాట్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కొండపై నుంచి బండరాళ్లు దొర్లుకుంటూ వచ్చి యాత్రికులు, పల్లకీ మోసేవాళ్లపై పడటంతో వారు లోయలో పడిపోయారు.

 సమాచారం అందుకున్న పోలీసులు, ఎస్ డీఆర్ఎఫ్ సిబ్బంది వెంటనే స్పాట్ కు చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. స్థానికుల సహాయంతో తాడును ఉపయోగించి లోయలో పడిపోయినవారిని బయటకు వెలికితీశారు.ఈ ప్రమాదంలో ఇద్దరు స్పాట్ ‎లోనే చనిపోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించామని  అధికారులు తెలిపారు.
 

©️ VIL Media Pvt Ltd.

​కేదార్నాథ్‎లో విషాదం.. కొండచరియలు విరిగిపడి ఇద్దరు మృతి  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *