కొంపముంచిన ఫోన్ కాల్..థాయ్‌లాండ్ ప్రధాని షినవత్రా సస్పెండ్
Follow
నవతెలంగాణ-హైదరాబాద్: ఫోన్‌కాల్ లీక్ కేసులో ప్రధాని పెటోంగ్‌టార్న్ షినవత్రాపై థాయ్‌లాండ్ రాజ్యాంగ న్యాయస్థానం సస్పెండ్ వేటు వేసింది. ఆమె నైతిక ప్రవర్తనను ఉల్లంఘించారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణకు మంగళవారం న్యాయమూర్తులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. 7-2 మెజారిటీతో జులై 1 నుండి రాజ్యాంగ న్యాయస్థానం తీర్పు ఇచ్చేంతవరకు ఆమెను ప్రధాని విధుల సస్పెండ్ చేసినట్లు ఒక ప్రకటన పేర్కొంది. తీర్పుపై షినవత్రా మాట్లాడుతూ.. తన విధులకు అంతరాయం కలగకూడదని తాను కోరుకున్నప్పటికీ, కోర్టు ఆదేశాలను అంగీకరిస్తానని అన్నారు.
కంబోడియా నేతతో షినవత్రా మాట్లాడిన ఫోన్‌కాల్ లీకైన సంగతి తెలిసిందే. ఆమె నైతికతను ఉల్లంఘించారని ఆరోపిస్తూ సంప్రదాయ సెనెటర్ల బృందం పిటిషన్ దాఖలు చేసింది. థాయ్‌లాండ్ కంబోడియాల మధ్య చాలాకాలంగా కొనసాగుతున్న ప్రాంతీయ వివాదం మేనెలలో సరిహద్దు ఘర్షణలకు దారితీసింది. మే 28న జరిగిన సాయుధ ఘర్షణలో ఒక కంబోడియా సైనికుడు మరణించాడు. సరిహద్దు వివాదంపై దౌత్య చర్చలు కొనసాగుతుండగా లీకైన షినవత్రా ఫోన్‌కాల్ ఫిర్యాదులు, ప్రజా నిరసనలకు దారితీసింది.
ప్రధాన పార్టీ రాజీనామాతో కుదేలైన సంకీర్ణ ప్రభుత్వంలో కొత్త కేబినెట్ నియామకానికి థాయ్‌లాండ్ రాజు మహా వజిరలాంగ్‌కార్న్ సోమవారం ఉదయం ఆమోదం తెలిపారు.
The post కొంపముంచిన ఫోన్ కాల్..థాయ్‌లాండ్ ప్రధాని షినవత్రా సస్పెండ్ appeared first on Navatelangana.
నవతెలంగాణ-హైదరాబాద్: ఫోన్‌కాల్ లీక్ కేసులో ప్రధాని పెటోంగ్‌టార్న్ షినవత్రాపై థాయ్‌లాండ్ రాజ్యాంగ న్యాయస్థానం సస్పెండ్ వేటు వేసింది. ఆమె నైతిక ప్రవర్తనను ఉల్లంఘించారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణకు మంగళవారం న్యాయమూర్తులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. 7-2 మెజారిటీతో జులై 1 నుండి రాజ్యాంగ న్యాయస్థానం తీర్పు ఇచ్చేంతవరకు ఆమెను ప్రధాని విధుల సస్పెండ్ చేసినట్లు ఒక ప్రకటన పేర్కొంది. తీర్పుపై షినవత్రా మాట్లాడుతూ.. తన విధులకు అంతరాయం కలగకూడదని తాను కోరుకున్నప్పటికీ, కోర్టు ఆదేశాలను అంగీకరిస్తానని
The post కొంపముంచిన ఫోన్ కాల్..థాయ్‌లాండ్ ప్రధాని షినవత్రా సస్పెండ్ appeared first on Navatelangana.