కొత్తపల్లిలో ఒకప్పుడు..!

Follow

రానా నటిస్తున్న తాజా చిత్రానికి ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమా ద్వారా ప్రవీణ పరుచూరి దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. గతంలో ఆమె కేరాఫ్ కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు.
గ్రామీణ నేపథ్యంలో సాగే కథాంశమిదని, చక్కటి హాస్యం..ఆలోచింపజేసే కథతో మెప్పిస్తుందని, ప్రతి ఒక్కరికి తమ ఊరు జ్ఞాపకాలను గుర్తుతెస్తుందని మేకర్స్ తెలిపారు. ఇందులో గ్రామీణ యువకుడిగా రానా పాత్ర కొత్త పంథాలో సాగుతుందని, ఆయన కెరీర్‌లో ఇదొక వైవిధ్యభరితమైన చిత్రమని దర్శకురాలు ప్రవీణ పరుచూరి పేర్కొన్నారు. త్వరలో ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయబోతున్నారు.