కొద్ది నెలల్లోనే మళ్లీ ఇరాన్ అణు కార్యక్రమం.. ఐఏఈఏ డైరెక్టర్ గ్రోస్సీ

Follow
X
Follow

వాషింగ్టన్, జూన్ 30: అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో అణు కేంద్రాలు ధ్వంసమైనప్పటికీ, కొన్ని నెలల వ్యవధిలోనే ఇరాన్ యురేనియం శుద్ధీకరణ తిరిగి ప్రారంభించగలదని ఐక్యరాజ్యసమితి నిఘా సంస్థ ‘ఐఏఈఏ’ హెచ్చరించింది. దాడులతో అణు కేంద్రాలకు నష్టం వాటిల్లినా, ఇరాన్ అణు మౌలిక సదుపాయాలు కొన్ని నెలల్లో మునుపటి సామర్థ్యాలను తిరిగి పొందగలదని ‘ఐఏఈఏ’ చీఫ్ రాఫెల్ గ్రోస్స్రీ అన్నారు.
ఒకవేళ యురేనియం శుద్ధీకరణను ఇరాన్ మళ్లీ మొదలుపెడితే, ఇరాన్‌పై మళ్లీ భీకరమైన బాంబు దాడులు చేయడాన్ని పరిశీలిస్తానని అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు.
అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో అణు కేంద్రాలు ధ్వంసమైనప్పటికీ, కొన్ని నెలల వ్యవధిలోనే ఇరాన్ యురేనియం శుద్ధీకరణ తిరిగి ప్రారంభించగలదని ఐక్యరాజ్యసమితి నిఘా సంస్థ ‘ఐఏఈఏ’ హెచ్చరించింది.