క్షతగాత్రులకు హరీశ్‌రావు పరామర్శ

Follow

పటాన్‌చెరు రూరల్, జూన్ 30: సిగాచీ పరిశ్రమలో జరిగిన పేలుడు దుర్ఘటనలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పరామర్శించారు. సోమవారం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పట్టణంలోని ధృవ దవాఖానకు బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి వచ్చిన ఆయన ఐసీయూలో ఉన్న కార్మికులను పరామర్శించి వివరాలు సేకరించారు.
వెంటిలేటర్‌పై ఉన్న ఐదుగురి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. వారికి మెరుగైన చికిత్స అందజేయాలని సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్యకు ఫోన్‌లో కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మాణిక్‌రావు, చింతా ప్రభాకర్, మాణిక్యం, శివకుమార్, మాజీ ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్, సత్యనారాయణ, నాయకులు ఆదర్శ్‌రెడ్డి, మెట్టు కుమార్‌యాదవ్, గడీల శ్రీకాంత్‌గౌడ్, మెరాజ్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
సిగాచీ పరిశ్రమలో జరిగిన పేలుడు దుర్ఘటనలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పరామర్శించారు. సోమవారం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పట్టణంలోని ధృవ దవాఖానకు బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి వచ్చిన ఆయన ఐసీయూలో ఉన్న కార్మికులను పరామర్శించి వివరాలు సేకరించారు.